వైఎస్సార్‌ తర్వాత కడప అభివృద్ధిని ఎవరూ పట్టించుకోలేదు

9 Jul, 2021 15:45 IST|Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, వైఎస్సార్‌జిల్లా : దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్సార్‌ తర్వాత కడప అభివృద్ధిని ఎవరూ పట్టించుకోలేదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. బుగ్గవంక పెండింగ్‌ పనులకు రూ. 50 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. శుక్రవారం వైఎస్సార్‌ కడప జిల్లాలో సీఎం జగన్‌ పర్యటించారు. మహవీర్‌ సర్కిల్‌లో  రహదారి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 

ఆరు, నాలుగు లైన్ల రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. డా.వైఎస్సార్‌ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి పనులు వేగంగా జరుగుతున్నాయని, డా.వైఎస్సార్‌ క్యాన్సర్‌ కేర్‌ సెంటర్‌కు టెండర్లు పూర్తయ్యాయని వెల్లడించారు.

అనంతరం.. వైఎస్‌ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్‌ స్టేడియం అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఫ్లడ్‌ లైటింగ్‌ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ రాజారెడ్డి, వైఎస్సార్‌ విగ్రహాలను ఆవిష్కరించారు.


(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు