AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్ష సూచన

10 Nov, 2021 11:09 IST|Sakshi

సాక్షి,  విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమ, ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కోస్తా జిల్లాలో మూడు రోజులపాటు వర్షాలు పడనున్నాయని తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. 

నెల్లూరు: అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో​ అధికారులు అప్రమత్తం అయ్యారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత అధికారులను కలెక్టర్‌ అప్రమత్తం చేశారు.

మరిన్ని వార్తలు