ఏపీలో సాంకేతిక విప్లవం తీసుకువస్తాం: గౌతమ్‌ రెడ్డి

30 Jan, 2021 12:46 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఇంటర్‌నెట్‌ పార్కుల ఏర్పాటుకు కృషి​ చేస్తామని, సాంకేతిక విప్లవం తీసుకువస్తామని ఏపీ ఫైబర్‌ నెట్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏపీ ఫైబర్ కేబుల్ నెట్ వర్క్ మొత్తం విశాఖపట్నం నుంచే మొదలవుతుంది. ఫైబర్ నెట్ వర్క్ సేవల్ని మరింత పటిష్టం చేస్తాం. ఫైబర్ నెట్‌కు రెండు ఎకరాలు కేటాయించారు. ప్రతి పల్లెకు ఇంటర్ నెట్ సేవలు అందిస్తాం. గూగుల్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న బ్యాండ్ విడ్త్ స్పీడ్ పెంచుతాం. 10 లక్షల కనెక్షన్లు ఉన్న వాటిని 50-70 లక్షల కనెక్షన్లు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. 

గత ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగాయి. విచారణ జరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిగారి ఆలోచనలకు అనుగుణంగా ఏపీ ఫైబర్ నెట్ సేవలు ఉంటాయి. మారుమూల పల్లెల్లో కూడా ఇంటర్ నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. 599 రూపాయలు చెల్లిస్తే ఆన్ లిమిటెడ్ ఇంటర్ నెట్. చాలా క్వాలిటీతో కూడిన సేవల్ని అందిస్తాం. పోల్ ఉచితంగా అందిస్తా’’ మన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు