ఆన్‌లైన్‌ టికెట్ విధానంపై మంత్రి పేర్ని నాని సమీక్ష

20 Sep, 2021 10:25 IST|Sakshi
మంత్రి పేర్నినాని (ఫైల్‌)

విజయవాడ: ఆన్‌లైన్‌ పద్దతిలో సినిమా టికెక్టు అమ్మాలనే ప్రక్రియ 2002 నుంచి ఉందని సమాచారశాఖ మంత్రి పేర్నినాని అన్నారు. ఇందులో భాగంగా సినీ పరిశ్రమకు చెందిన తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధుల్ని ప్రభుత్వం నేడు చర్చకు పిలిచిందన్నారు. ఆన్‌లైన్‌​ టికెట్‌ విధానంపై విజయవాడలో మంత్రి పేర్ని నాని సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులతోపాటు దిల్‌ రాజు, డీఎన్‌వీ ప్రసాద్‌, ఆది శేషగిరి రావు, డీవీవీ దానయ్య హాజరయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఆన్‌లైన్‌ టికెట్‌ వ్యవస్థ, కరోనా వలన సిని పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి చర్చించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి  ఎగ్జిబిటర్ల సమస్యలు, నిర్మాతల  సమస్యలు  అన్నింటిని  ప్రభుత్వం తరపున  తాము  నమోదు చేసుకున్నామని తెలిపారు. త్వరలోనే  సినీ పరిశ్రమ  సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో  చర్చించిన తర్వాత  పరిష్కారం తీసుకుంటామన్నారు. ఆన్‌లైన్‌  టికెట్  వ్యవస్థ కు సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రతినిధులు సానుకూలంగా  ఉన్నారని, మళ్ళీ  ఇంకోసారి  సినిమా  ప్రతినిధులు, ఛాంబర్ ఆఫ్  కామర్స్ సభ్యులు సమావేశం  అవుదామని తెలిపినట్లు పేర్కొన్నారు. సీఎం  జగన్  ఎప్పుడు  కూడా సాధారణ  ప్రేక్షకులకు  వినోదం  అందుబాటులో  ఉంచేలా  చేస్తారని వెల్లడించారు.

చదవండి: Youngest MPTC: చిన్న వయసులోనే.. ‘ఎంపీటీసీ’!

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు