విజయదశమి: అర్చకులకు సీఎం జగన్‌ తీపికబురు

19 Oct, 2023 18:29 IST|Sakshi

సాక్షి, అమరావతి: విజయదశమి సందర్భంగా అర్చకులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారు. అర్చకులకు ఇచ్చిన ఎన్నికల హామీని సీఎం జగన్‌ నెరవేర్చారు. 26 జిల్లాలోని 1,177 మంది అర్చకులకు కనీస వేతనం రూ.15,625లు అమలు చేస్తూ దేవాదాయ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇంద్రకీలాద్రికి సీఎం జగన్‌
రేపు(శుక్రవారం) ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారికి సీఎం వైఎస్ జగన్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. పట్టు వస్త్రాలతోపాటు పసుపు, కుంకుమలను ప్రభుత్వం తరపున అందించనున్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కనకదుర్గ అమ్మవారి జన్మనక్షత్రమైన మూల.. ఈ నెల 20వ తేదీ, శుక్రవారం కలిసి రావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది. అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులను అనుగ్రహించనున్నారు.
చదవండి: వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రకటన.. పురస్కార గ్రహీతలు వీరే..

మరిన్ని వార్తలు