కేసీఆర్‌ ఇకపై మీ ప్రభుత్వం ఉండదు.. ప్రజా ప్రభుత్వం రాబోతుంది: రాహుల్‌ గాంధీ

19 Oct, 2023 18:05 IST|Sakshi

సాక్షి, పెద్దపల్లి: బీఆర్‌ఎస్‌ బీజేపీతో కుమ్మక్కైందని కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌ను, కేంద్రంలో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఎంత అవినీతి చేసిన విచారణ జరగలేదని అన్నారు. కులగణన చేయడానికి కేసీఆర్‌ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఇకపై మీ ప్రభుత్వం ఉండదని.. ప్రజా ప్రభుత్వం రాబోతుందని పేర్కొన్నారు.  

కేసీఆర్‌ కుటుంబానికే ముఖ్యశాఖలు
తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్‌ 2004లో హామీ ఇచ్చిందని రాహుల్‌ పేర్కొన్నారు. రాజకీయ నష్టం జరిగినా సోనియా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. 10 ఏళ్ల తర్వాత కూడా సోనియా కల, తెలంగాణ ప్రజల కలను కేసీఆర్‌ నెరవేర్చలేదని మండిపడ్డారు. సీఎం కుటుంబ సభ్యులే ప్రభుత్వంలోని ముఖ్యశాఖలను కంట్రోల్‌ చేస్తున్నారని దుయ్యబట్టారు. 

మేం అబద్ధాలు చెప్పం..
కొన్ని రోజుల క్రితం పార్లమెంట్‌లో కులగణన గురించి మాట్లాడినట్లు రాహుల్‌ తెలిపారు. ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేశారని, తన ఇల్లు కూడా లాక్కున్నారని ప్రస్తావించారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా కులగణన చేస్తామని భరోసా ఇచ్చారు. తాము అబద్ధాలు చెప్పామని, ఆరు గ్యారెంటీలను మొదటి కేబినెట్‌లోనే ఆమోదిస్తామని అన్నారు. రైతు భరోసా ద్వారా ఎకరాకు 15 వేలు ఇస్తామని, సింగరేణి గనులను ప్రవేటే పరం కానివ్వమని హామీ ఇచ్చారు.
చదవండి: అబ్రహంకు బీఫామ్‌ ఇవ్వని కేసీఆర్‌.. కలవకుండా కారెక్కి వెళ్లిపోయిన కేటీఆర్‌

చెప్పిన హామీలు అమలు చేస్తాం
‘కర్ణాటక.. రాజస్థాన్‌లో అమలు చేశాం.  తెలంగాణలోనూ మేము చెప్పిన హామీలు అమలు చేస్తాం. తెలంగాణ మహిళలు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తారు. వంట గ్యాస్ రూ. 500కే ఇస్తాం. రైతులకు, రైతు కూలీలకు ఇచ్చిన హామీలు కూడా చేస్తాం. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ కార్యకర్తలు సింహాల్లాంటివారు. కేసీఆర్‌ సీఎంలా కాదు రాజులా వ్యవహరిస్తున్నారు.

కాళేశ్వరంతో కాంట్రాక్టర్లకే లాభం
రైతు బంధుతో భూస్వాములకే లాభం. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఎంతమందికి వచ్చాయి?. కాళేశ్వరంలో అనినీతికి పాల్పడి లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారు. కాళేశ్వరంతో మీకు లాభం చేకూరిందా?. కేవలం కాంట్రాక్టర్లకే లాభం చేకూరింది. ధరణి పోర్టల్‌తో మీకు లాభం చేకూరిందా?. ధరణిలో భూముల రికార్డు మార్చారు. పేదల భూములు లాక్కున్నారు. కేసీఆర్ మూడెకరాలు దళితులకు ఇస్తాం అన్నారు ఇవ్వలేదు. మోదీ 15 లక్షలు మీ అకౌంట్‌లో వేస్తా అన్నారు ఇవ్వలేదు.

దేశ బడ్జెట్‌ రూ. 44 లక్షల కోట్లు. ఈ డబ్బులు ఎక్కడికి వెళ్లాలన్నది 90 మంది కార్యదర్శులు నిర్ణయిస్తారు. 90 మంది కార్యదర్శులల్లో ముగ్గురు మాత్రమే ఓబీసీ వారు ఉన్నారు. తెలంగాణకు వస్తే ఎంతో సంతోషంగా  ఉంది. తెలంగాణతో నాకున్న సంబంధం రాజకీయపరమైనది కాదు. మీ అందరితో నాకు ప్రేమ, కుటుంబ అనుబంధం ఉంది. 

మరిన్ని వార్తలు