ఎట్‌హోం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్‌

26 Jan, 2023 16:42 IST|Sakshi

సాక్షి, విజయవాడ: గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. 

అయితే, గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఎట్‌హోం కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు పాల్గొన్నారు. వారితో పాటుగా హైకోర్టు సీజే ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా కూడా పాల్గొన్నారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు