AP CM Jagan: చంద్రబాబే ఎత్తు తగ్గుతున్నారు: సీఎం జగన్‌

22 Mar, 2022 14:52 IST|Sakshi

CM Jagan Speech On Polavaram Project Works: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే పూర్తి చేయకుండానే కాఫర్‌ డ్యామ్‌ కట్టారని, మధ్యలో మూడు పెద్ద ఖాళీలు వదిలి పెట్టారని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ ప్రగతిపై స్వల్ప కాలిక చర్చలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆర్థిక నష్టంతో పాటు నిర్మాణంలో విపరీతమైన జాప్యం జరిగిందని తెలిపారు.

దిగువ కాపర్‌డ్యామ్‌కు కూడా భారీ నష్టం వాటిల్లిందని, పునాదిపైన, లోపల కలిపి 35.6 మీటర్ల మేర గుంట ఏర్పడిందని తెలిపారు. చంద్రబాబు తప్పిదాలతోనే పోలవరానికి ఈ పరిస్థితి వచ్చిందని సీఎం జగన్‌ అన్నారు. వక్రీకరణ, అబద్దాలపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. తాను విజనరి అని చెప్పుకునే చంద్రబాబు వల్లే ప్రాజెక్టుకు కష్టాలు వచ్చాయని తెలిపారు. కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టును తన చేతుల్లోకి తీసుకున్నారు. 2013-2014 అంచనాల ప్రకారమే ప్రాజెక్టు కడతామని చెప్పారని అన్నారు. దీనిపై ప్రశ్నిస్తే అప్పట్లో అసెంబ్లీలో తమ గొంతు నొక్కారని అ‍న్నారు.

పోలవరం ప్రాజెక్టు కాదు.. చంద్రబాబే ఎత్తు తగ్గుతున్నారని తెలిపారు. చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని తెలిపారు. వచ్చే  ఎన్నికల్లో కుప్పంలో కూడా చంద్రబాబుకు ఓటమి తప్పదని అ‍న్నారు. ప్రత్యేక హోదాను తాకుట్టుపెట్టి పోలవరం ప్రాజెక్టును తీసుకున్నారని చెప్పారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నామని చంద్రబాబుకు ఎవరు చెప్పారు? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేసిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక్క ఇంచు కూడా తగ్గించమని సీఎం జగన్‌ తెలిపారు.

పోలవరం టూర్‌ పేరుతో రూ.100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని సీఎం జగన్‌ తెలిపారు. పోలవరం వద్ద తన అనుచరులతో చంద్రబాబు భజన చేయించుకున్నారని చెప్పారు. 2023 ఖరీఫ్‌ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలిపారు. ఉక్కు సంకల్పంతో పోలవరం నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. కేంద్రం సమకారంతో ఆర్‌అండ్‌ఆర్‌ పనులు వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. పోలవరం వద్ద వైఎస్సార్‌ విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును వైఎస్సార్‌కు అంకితం చేస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును తన తండ్రి వైఎస్సార్‌ ప్రారంభించారని ఆయన వారసుడిగా కచ్చితంగా ప్రాజెక్టును తాను పూర్తి చేస్తానని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు