అవనిగడ్డ పర్యటనకు సీఎం జగన్‌

20 Oct, 2022 04:18 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం కృష్ణా జిల్లా అవనిగడ్డలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి.. 10.55 గంటలకు అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చేరుకుంటారు. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

22 ఏ (1) కింద ఉన్న నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్‌ పత్రాలను రైతులకు సీఎం జగన్‌ అందజేస్తారు. మధ్యాహ్నం 12.25 గంటలకు అవనిగడ్డ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 1.25 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.   

మరిన్ని వార్తలు