జోగి రమేష్‌ కుమార్తె పెళ్లి.. దంపతులకు సీఎం జగన్‌ ఆశీర్వాదం

22 Nov, 2023 19:37 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. మంత్రి జోగి రమేష్‌ కుమార్తె వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధువరులను సీఎం జగన్‌ ఆశీర్వదించారు. 

వివరాల ప్రకారం.. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ కుమార్తె వివాహా వేడుకకు సీఎం వైఎస్‌ జగన్‌ హాజరయ్యారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన వివాహ వేడుకకు సీఎం జగన్‌ వెళ్లారు. ఈ సందర్బంగా వేడుకలో వధువు రేష్మా ప్రియాంక, వరుడు అమోఘ్‌ సతీష్‌ గుత్తేదార్‌లను ముఖ్యమంత్రి జగన్‌ ఆశీర్వదించారు. 

మరిన్ని వార్తలు