ఇంత ఆత్మవంచన అవసరమా పురంధేశ్వరి: విజయసాయిరెడ్డి

22 Nov, 2023 18:54 IST|Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరికి స్ట్రాంగ్‌ పొలిటికల్‌ కౌంటరిచ్చారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. బాబు గారి బెయిలుకే షూరిటీ లేదు. మరి ఆయన ప్రజల భవిష్యత్తుకు ఏం గ్యారెంటీ ఇస్తారు?. ఎవరికి బెయిల్ వచ్చినా సంతోషిస్తారు చిన్నమ్మా! కానీ కొందరి బెయిల్ మాత్రమే రద్దు చెయ్యమంటారు. ఇంత ఆత్మవంచన అవసరమా అని ప్రశ్నించారు. 

కాగా, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా..‘బాబు గారి బెయిలుకే షూరిటీ లేదు - మరి ఆయన ప్రజల భవిష్యత్తుకు ఏం గ్యారెంటీ ఇస్తారు? బాబు గారు వస్తే ఇంటింటికి లక్షలు లక్షలు వచ్చి పడతాయంటూ పచ్చ వర్గం మభ్యపెడుతోంది. మరి 14 ఏళ్ళు ఏమి చేసినట్లు? ప్రజలకు చెందాల్సినదాన్ని తన వాళ్లకు దోచిపెట్టాడా? తను దోచుకున్నాడా?’ అని అన్నారు. 

ఇదే సమయంలో..‘ఎవరికి బెయిల్ వచ్చినా సంతోషిస్తారు చిన్నమ్మా! కానీ కొందరి బెయిల్ మాత్రమే రద్దు చెయ్యమంటారు. ఇంత ఆత్మవంచన అవసరమా పురంధేశ్వరి గారూ? తను దోచుకున్న దాంట్లో వాటా ఇచ్చే బావ గారికి బెయిల్ వచ్చిందని ఆనందంలో తేలిపోతున్నారు. అయ్యో! అలాంటిది ఏమీ లేదంటే.. సుప్రీంకోర్టు CJI గారికి లేఖ రాయండి బెయిల్ రద్దు చేయమని’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

మరిన్ని వార్తలు