‘అమ్మా-నాన్న ఇద్దరూ దివ్యాంగులు.. నేను ఆనందంగా ఉండటానికి కారణం జగనన్న’

24 May, 2023 11:44 IST|Sakshi

కొవ్వూరు: జనవరి–ఫిబ్రవరి–మార్చి 2023 త్రైమాసికా­నికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన నిధులను విడుదల కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్‌ బుధవారం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పర్యటనకు వచ్చారు. దీనిలో భాగంగా  ఓ విద్యార్థిని మాట్లాడుతూ.. సీఎం జగన్‌ అందిస్తున్న సంక్షేమంపై ప్రశంసలు కురిపించింది. 


‘నేను ఇంత ఆనందంగా ఉండటానికి కారణం జగనన్న. మా నాన్న, అమ్మ ఇద్దరూ దివ్యాంగులు. మా నాన్నకు పక్షవాతం వచ్చి నడవలేని స్థితిలో ఉంటే మా  అమ్మ చెవిటి-మూగ. అయితే నేను ఉన్నాను. నేను విన్నాను అంటూ జగనన్న మాకు అండగా నిలిచారు. మాకు విద్యా దీవెనతో పాటు, వసతి దీవెన కూడా జగనన్న అందించారు. మా కుటుంబానికి అండగా నిలబడిన జగనన్నకు కృతజ్ఞతలు. నా చిట్టి చెల్లెమ్మకు నేను ఉన్నాను అంటూ వసతి దీవెన అందించి నన్ను నిలబెట్టాడు మా అన్న. నేను ఫస్ట్‌ క్లాస్‌ నుంచి ఇంటర్‌ వరకూ తెలుగు మీడియంలోనే చదువుకున్నా.. నాకున్న ఆర్థిక పరిస్థితి సరిపోక తెలుగు మీడియంలోనే చదువుకున్నా.

ఇప్పుడు కార్పోరేట్‌ కాలేజీలో బీకామ్‌ కంప్యూటర్స్‌ చదువుతున్నానంటే అది మీ దయే అన్నా. నేను స్కూల్‌ స్టడీస్‌లో ఉండగా అంతా ఇబ్బందిగా ఉండేది.  వసతులు ఏవీ బాగుండేవి కావు. మీరు వచ్చిన తర్వాత స్కూళ్ల రూపురేఖలే మార్చేశారన్నా. ఇప్పటి గవర్నమెంట్‌ స్కూళ్లను చూస్తుంటే మళ్లీ స్కూల్‌కి వెళ్లాలనిపిస్తుందన్నా’ అని విద్యా దీవెన అందుకుంటున్న తాళ్లపూడి మండలకు చెందిన దివ్య అనే డిగ్రీ బాలిక తన ప్రసంగం ద్వారా ఆకట్టుకుంది. ప్రసంగం తర్వాత ఆ విద్యార్థిని వేదికపై ఉన్న సీఎం జగన్‌ వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకుంది.

‘సార్, నేను దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను, మా నాన్న రైతు, అమ్మ గృహిణి, నేను జగనన్న విద్యాదీవెన లబ్ధిదారుడిని, గతంలో కేవలం రూ. 35 వేలు మాత్రమే ఇచ్చేవారు కానీ ఇప్పుడు పూర్తిగా ఫీజు మొత్తం కూడా ఫీజు రీఇంబర్స్మెంట్ ద్వారా పొందుతున్నాం. మీరు  మోసపూరిత హమీలు ఇవ్వకుండా ఇచ్చిన ప్రతి హమీ నెరవేర్చిన ఏకైక నాయకుడు మీరు. మీరు ఉన్నత విద్యలో ప్రభావవంతమైన సంస్కరణలు తీసుకొచ్చారు, నూతన విద్యా విధానానికి సంబంధించిన పాలసీని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం మనది.

మన విద్యా విధానం అంతర్జాతీయ స్ధాయికి ఎదిగింది, మీ హయాంలో ఇంజినీరింగ్ ప్లేస్‌మెంట్‌లలో 90 శాతంపైగా సాధిస్తున్నారు, నా కాలేజ్ విద్యార్ధి అమేజాన్ లో రూ. 44 లక్షల ప్యాకేజ్ కి సెలక్ట్ అయ్యాడంటే మీరే కారణం. మీ నవరత్నాల పథకాల లబ్ధి పొందుతున్నాం, మీరు మాపై ఖర్చుపెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేసి ఏపీని ముందుకు తీసుకెళతాం, మీ పేరు ఎక్కడ రాయాలన్న చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీగా కాకుండా ద పర్మినెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీగా రాయాలనుకుంటున్నాం, అటువంటి అవకాశం మీరు కల్పించాలి, ధ్యాంక్యూ.’
-ప్రసన్నకుమార్, బీటెక్ విద్యార్ధి, తాడేపల్లిగూడెం

మరిన్ని వార్తలు