మూడు రాజధానులతో అన్ని ప్రాంతాల అభివృద్ధి

1 Nov, 2022 03:19 IST|Sakshi
విజయవాడలో మాలమహానాడు బైక్‌ ర్యాలీ

మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు యోనారాజు  

విజయవాడలో బైక్‌ ర్యాలీ.. ఒక రోజు దీక్ష   

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న మహోన్నత ఆశయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన మూడు రాజధానులకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు నత్తా యోనారాజు పునరుద్ఘాటించారు. మూడు రాజధానులకు మద్దతుగా విజయవాడలో సోమవారం మోటార్‌ సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం గాంధీనగర్‌లోని ధర్నా చౌక్‌లో నిర్వహించిన ఒక రోజు దీక్ష విజయవంతంగా ముగిసింది. యోనారాజు మాట్లాడుతూ అమరావతి రాజధాని పేరుతో టీడీపీ చేస్తున్న డ్రామాలకు వ్యతిరేకంగా, మూడు రాజధానులకు మద్దతుగా మాలమహానాడు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు దీక్షలు తలపెట్టామని, ఏలూరు జిల్లాలో పూర్తిచేసినట్లు తెలిపారు.

ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఏపీ ఫైబర్‌ నెట్‌ చైర్మన్‌ పి.గౌతంరెడ్డి, వైఎస్సార్‌సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు బొప్పన భవకుమార్, ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు మారేష్, నవ్యాంధ్ర ఎంఆర్‌పీఎస్‌ అధ్యక్షుడు శ్రీనివాసరావు మద్దతు తెలిపారు. 

మరిన్ని వార్తలు