ప్రతిఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలి

28 Mar, 2021 18:18 IST|Sakshi

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్

సాక్షి, విజయవాడ: ప్రతిఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా కేసుల దృష్ట్యా ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించాలన్నారు. కరోనా వ్యాప్తి కట్టడికి పోలీసు శాఖకు సహకరించాలని.. కోవిడ్ నిబంధనలు పాటించకపోతే భారీగా జరిమానాలు విధించక తప్పదన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్ధన్నారు. ఫంక్షన్స్, పార్టీలు వీలైతే వాయిదా వేసుకోవాలని సూచించారు.మాస్క్, భౌతికదూరం, శానిటైజర్ వాడటం అలవాటుగా మార్చుకోవాలన్నారు. స్కూల్స్, కాలేజీల్లో భౌతికదూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ సూచించారు.
చదవండి:
మహిళలే టార్గెట్‌: పరిచయాలు పెంచుకుని..
మగవాళ్లు ఆడవాళ్లుగా.. హోలీ సంబరాల్లో వింత ఆచారం 

మరిన్ని వార్తలు