కోనసీమలో డ్రోన్‌ హబ్‌ ప్రారంభం

6 Mar, 2024 05:12 IST|Sakshi

సాక్షి,అమలాపురం: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలం దేవగుప్తం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్‌) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రోన్‌ హాబ్‌ను కలెక్టర్‌ శుక్లా మంగళవారం ప్రారంభించారు. అమలాపురం స్టేడియంలో 21 ఫ్లయింగ్‌ డ్రోన్లను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ..రూ.2 కోట్లతో దేవగుప్తం పీఏసీఎస్‌ 21 డ్రోన్లను కొనుగోలు చేసిందన్నారు.

ఒక్కొక్క డ్రోన్‌ 6–8 నిమిషాల్లో ఒక ఎకరానికి స్ప్రేయింగ్‌ ప్రక్రియను పూర్తి చేస్తుందని తెలిపారు. పైలట్‌ ప్రాజెక్ట్‌గా కొనుగోలు చేసిన ఈ డ్రోన్స్‌ను అద్దె ప్రాతిపదికన రైతులకు అందుబాటులో తెస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు స్పేయర్‌ ఎకరాకు రూ.వెయ్యి ఖర్చుతో పిచికారీ చేస్తున్నారని, డ్రోన్‌ టెక్నాలజీతో ఎకరాకు రూ.­300 అవుతుందన్నారు. రైతులు బృందంగా ఏర్ప­డితే రూ.10 లక్షలు విలువైన వ్యవసాయ డ్రోన్‌ను కొనుగోలు చేయవచ్చన్నారు.

దేవగుప్తం పీఏసీఎస్‌ చైర్మన్, రాష్ట్ర అగ్రి మిషన్‌ సభ్యుడు జిన్నూరి రామారావు (బాబి) మాట్లాడుతూ ప్రతి మండలంలో ఒక డ్రోన్‌ ఉండేలా ప్రభుత్వం ఆలోచన చేసిందన్నారు. వైఎస్సార్‌ హార్టీకల్చర్‌ వర్సిటీ సభ్యుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినా««ద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు