పేదల చదువులపై పిచ్చి ప్రేలాపనలు

15 Dec, 2023 06:10 IST|Sakshi

రామోజీరావు నడిపిస్తున్న రమాదేవి స్కూల్‌లో ట్యాబ్‌లు లేకుండానే విద్యా బోధన జరుగుతోందా?

అక్కడి విద్యార్థులు వాడుతున్నప్పుడు పేదింటి పిల్లలు వాడితే తప్పెలా అవుతుంది?

సాక్షి, అమరావతి: పేద పిల్లలు విద్యలో ఉన్నతంగా రాణించాలని, అంతర్జా­తీయ స్థాయిని అందుకోవా­లన్న సము­న్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న ట్యాబ్‌ల పైనా ‘ఈనాడు’ విషం చిమ్మింది. ఈ ట్యా­బ్‌లు చాలా సుర­క్షి­తమైనవి. విద్యార్థుల మెదళ్లకు పదు­ను పెట్టేలా పాఠ్యాంశాలు, విద్యా పరమైన కంటెంట్‌ మాత్రమే ఉంటుంది. దీనికి లాకింగ్‌ వ్యవస్థ కూడా ఉంటుంది. నిరంతర పర్యవేక్షణా ఉంటుంది. ఒకవేళ ఎవ­రైనా ఇతరత్రా విధానాలతో తప్పుగా వినియోగించినా లాక్‌ అయిపోతుంది.

ఇంత సురక్షి­తౖ­మెన, పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఉన్న ట్యాబ్‌లపై ఈనాడు పత్రికలో తప్పుడు ఆరోపణలతో పసి మనసులను కలుషితం చేసేలా దురుద్దేశపూరిత కథనం ప్రచురించడం రామోజీ­రావుకు మాత్రమే చెల్లింది. ‘జగన్‌ బర్త్‌డే బహుమతి..చెడగొడుతోంది మతి!’ అంటూ పేద పిల్లలకు ఏవోవో ఆపాదిస్తూ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. మనసున్న ఏ మనిషీ ఇలా పసి మనసులపై విషం చిమ్మే ప్రయత్నం చేయరు.

ఈ ఆధునిక యుగంలో అసలు ఏ సంస్థ అయినా, వ్యక్తులైనా విద్యార్థులకు అత్యాధునిక విద్యా పరికరాలను అందించవద్దని చెబుతారా? రామోజీరావు నడిపిస్తున్న రమాదేవి స్కూల్‌లో ట్యాబ్‌లు, అత్యాధునిక పరికరాలు లేకుండానే విద్యా బోధన జరుగుతోందా? అక్కడి విద్యార్థులు వాడుతున్నప్పుడు పేదింటి పిల్లలు వాడితే తప్పెలా అవుతుంది? సమాజంలో పిల్లలందరూ ఉన్నత స్థితికి చేరాలని ఎవరైనా కోరుకుంటారు..

ఒక్క రామోజీ తప్ప. ఆయన తన వర్గం, చంద్రబాబు మాత్రమే బాగుండాలని, మిగతా అందరూ తక్కువ స్థాయిలో ఉండాలన్న యావలో ఉంటారు. మరీ ముఖ్యంగా పేదలు బాగు పడుతుంటే చూడలేని కళ్లు అవి. పేదలు పేదలుగానే ఉండాలని, వారికి మంచి చదువులు అందకూడదన్నది ఆయన దృక్పథం. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం చదువులు ప్రవేశపెట్టినప్పుడు, టోఫెల్‌æ శిక్షణ అమలు చేసినప్పుడు కూడా ఈనాడు ఇదే విధమైన వ్యతిరేక కథనాలు అచ్చేసింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం విద్యా రంగంలో తీసుకువస్తున్న విప్లవాత్మక సంస్కరణలపై నిత్యం తప్పుడు ప్రచారాలు, వక్రీకరణలు చేస్తోంది.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం దశాబ్దాల కాలంగా నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ విద్యా రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి, దానికి మహర్దశ తీసుకువస్తోంది. ఇదే ఈనాడుకు కడుపుమంట. సంపన్నుల పిల్లలకు మాత్రమే వేలు, లక్షల రూపాయలు ఖర్చు చేస్తే అందే నాణ్యమైన విద్యను ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నదనే ఏడుపు. అందుకే చీటికిమాటికి పేద పిల్లల విద్యపై తప్పుడు రాతలు రాస్తోంది.

ట్యాబ్స్‌కు పటిష్ట రక్షణ వ్యవస్థ
► విద్యార్ధులు ట్యాబ్‌లను నిర్దేశిత పాఠ్యాంశాలకు తప్ప, విద్యేతర అంశాలకు వాటిని వినియోగించకుండా ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంది. ప్రతి ట్యాబ్‌లోనూ మొబైల్‌ డివైస్‌ మేనేజ్‌మెంట్‌ (ఎండీఎం) ను పొందుపరిచింది. దీనివల్ల విద్యార్థులకు అవసరమైన 5 యాప్స్‌ మాత్రమే పనిచేస్తాయి. అంతేకాక నిర్వహణ, మరమ్మతుల విషయంలో కూడా విద్యాశాఖ స్పష్టమైన ఎస్‌ఓపీని నిర్దేశించుకుంది.

► ఎవరైనా ఉద్దేశపూర్వకంగా బలవంతంగా ట్యాబ్‌ను రీసెట్‌ చేసి, మరో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసేందుకు యత్నిస్తే ఇంటర్నెట్‌ కనెక్టయిన వెంటనే ఆ ట్యాబ్‌ లాక్‌ అయిపోతుంది. దీన్ని అన్‌లాక్‌ చేయా­లంటే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాత్రమే చేయగలుగుతారు. వారు కూడా గూగుల్‌ అథంటికేటర్‌తో వారికి వచ్చిన ఓటీపీ ద్వారా మాత్రమే తిరిగి ఓపెన్‌ చేయగలరు.

► ట్యాబ్స్‌ నిర్వహణలో మూడంచెల రక్షణ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ట్యాబ్స్‌లో లోపాలు వస్తే సరిచేయడానికి ప్రతి పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులకు సాంకేతిక శిక్షణ ఇచ్చారు. హార్డ్‌వేర్‌ సమస్యలను సరిదిద్దేలా గ్రామ/వార్డు సచి­వాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌కు శిక్షణ ఇచ్చారు. లోపాలు ఉన్న ట్యాబ్‌ను విద్యార్థి లేదా తల్లిదండ్రులు సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌కు అందజేస్తే రసీదు ఇచ్చి మూడు రోజుల్లో వాటిని బాగుచేసి తిరిగి ఇస్తున్నారు. ఇంత పటిష్టమైన రక్షణ వ్యవస్థ, నిర్వహణ వ్యవస్థ ఉన్న ట్యాబ్‌లపై పిచ్చి ప్రేలాపనలు రామోజీ తప్ప మరెవరూ చేయలేరు.

పునశ్చరణ, మెరుగైన బోధన కోసం ట్యాబ్‌లు
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ప్రపంచ­స్థాయి పోటీని తట్టుకునేలా మలచడంతోపాటు మెరుగైన విజ్ఞానం పొందేందుకు ట్యాబ్‌లను ఇవ్వా­లన్నది సీఎం వైఎస్‌ జగన్‌ ఆకాంక్ష. అందు­కోసమే 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. విద్యార్థులు పాఠా­­లను సులభంగా అర్థం చేసుకునేందుకు, పునశ్చరణకు, మెరుగైన బోధనలో భాగంగా వీటి­ని పంపిణీ చేస్తున్నారు.

ఇవి వారికి ఇంటర్‌ వరకు ఉపయోగపడ­తాయి. 2021–22 విద్యా సంవత్స­రంలో 8వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయు­లకు బైజూస్‌ కంటెంట్‌తో 5.18 లక్షల ట్యాబ్‌లను గతేడాది డిసెంబర్‌ 21న ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ ఏడాది కూడా మరో 4.35 లక్షల ట్యాబ్‌లను ఈ నెలలో సరఫరా చేస్తోంది. గత ఏడాది ట్యాబ్‌ల పంపిణీ కోసం రూ.660 కోట్లను ఖర్చు చేసింది. పిల్లలు పాఠాలు నేర్చుకునేందుకు వీలుగా బైజూస్‌ యాప్‌ డిక్షనరీ, సందేహాల నివృత్తికి మరో యాప్, ఏపీ ఈ–పాఠశాల యాప్‌లను ట్యాబుల్లో ఇన్‌స్టాల్‌ చేసి విద్యార్థులకు, టీచర్లకు ఇచ్చారు.

ఈ ఏడాది నుంచి విద్యార్థులు వారికి ఇష్టమైన విదేశీ భాషను నేర్చుకు­నేందుకు డ్యులింగో యాప్‌ను అదనంగా చేర్చారు. దేశవ్యాప్తంగా ఏ పోటీ పరీక్షనైనా ఎదుర్కొనేందుకు వీలుగా విద్యార్థులు సన్నద్ధమయ్యేందుకు ఈ ట్యాబ్స్‌ను అందించారు. ఇప్పటికే ఎన్‌ఎంఎంఎస్‌ జాతీయ పరీక్షల్లో చాలామంది ప్రభుత్వ పాఠశాలల విద్యా­ర్థులు ఉత్తీర్ణులయ్యారు. వారికి ఏటా రూ.12 వేల చొప్పున నాలుగేళ్లపాటు మెరిట్‌ స్కాలర్‌షిప్‌ లభి­స్తోంది. విద్యార్థులు ఆన్‌లైన్‌లో చదువు­కో­వాలంటే చాలా ఎక్కువ సిలబస్‌ ఉంటుంది. దీని­వ­ల్ల విద్యా­ర్థులు నేర్చుకునేందుకు చాలా సమ­యం పడు­తుంది. దీనికోసం నిష్ణాతులైన ఉపా­ధ్యా­యు­లతో కంటెంట్‌ తయారు చేసి ట్యాబ్స్‌లో అప్‌లోడ్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు