విశాఖ శారదాపీఠంలో గోపూజ

16 Jan, 2022 11:09 IST|Sakshi

విశాఖపట్టణం: విశాఖ శ్రీ శారదాపీఠంలో కనుమ వేడుకలు జరిగాయి. పీఠం ప్రాంగణంలోని గోశాలలో గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు స్వయంగా గోపూజ చేసారు.

గోమాతకు హారతులిచ్చి పండ్లు, అరిసెలు తినిపించారు. తెలుగు రాష్ట్రాలు పాడిపంటలతో సస్యశ్యామలంగా ఉండేలా చూడాలని గోమాతను ప్రార్ధించారు.

మరిన్ని వార్తలు