గుంటూరు: మ్యాచింగ్‌ సెంటర్‌ ముసుగులో వ్యభిచారం

19 Mar, 2021 10:42 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ సుప్రజ, పక్కన ఎస్‌హెచ్‌వో మల్లిఖార్జునరావు

సాక్షి, పట్నంబజారు(గుంటూరు): చీరల వ్యాపారం ముసుగులో చీకటి వ్యాపారం చేస్తున్న మహిళను పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. వ్యభిచార నిర్వాహకురాలితో పాటు, ముగ్గురు మహిళలు, ముగ్గురు విటులను అరెస్ట్‌ చేశారు. గుంటూరు నగరంపాలెం పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెస్ట్‌ సబ్‌ డివిజన్‌ డీఎస్పీ కె.సుప్రజ  వివరాలు వెల్లడించారు. గుంటూరు ఏటీ అగ్రహారం జీరో (0) లైనులో నివాసం ఉండే షేక్‌ లాల్‌బీ అలియాస్‌ శ్రీలక్ష్మి, ఇంట్లోనే శ్రీలక్ష్మి మ్యాచింగ్‌ సెంటర్‌ పేరుతో చిన్నపాటి వస్త్ర దుకాణం నడుపుతోంది. పదేళ్ల కిందట ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో పనిచేసే శ్రీనివాసరావును వివాహం చేసుకుంది. అప్పటికే విలాసాలకు అలవాటు పడిన శ్రీలక్ష్మి సులువుగా డబ్బు సంపాదించాలనే దురాచలోనతో మ్యాచింగ్‌ సెంటర్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తోంది.

ఈ క్రమంలో షాపునకు వచ్చే చిన్న కుటుంబాలకు చెందిన మహిళలు, భర్తను కోల్పోయినవారు, కుటుంబ పరిస్థితులు సరిగా లేనివారు, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్న యువతులను మభ్యపెట్టి వారిని చీకటి కూపంలోకి దింపి వ్యభిచారం చేయిస్తోంది. పక్కా సమాచారంతో నగరంపాలెం పోలీసులు ఈ నెల 17వ తేదీ రాత్రి ఏటీ అగ్రహారంలోని ఆమె నివాసంలో దాడి చేసి నిర్వాహకురాలు శ్రీలక్షి్మ, ముగ్గురు యువతులు, ముగ్గులు విటులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.5 వేల నగదు, మూడు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్‌ఫోన్‌లను స్వా«దీనం చేసుకున్నారు. మరెక్కడైనా ఇటువంటి వ్యభిచార గృహాలు ఉంటే డయల్‌ 100, లేక వెస్ట్‌ డీఎస్పీ ఫోన్‌ నంబర్‌ 86888 31330కు సమాచారాన్ని అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. సమావేశంలో నగరంపాలెం పీఎస్‌ ఎస్‌హెచ్‌వో ఎ.మల్లిఖార్జునరావు, సిబ్బంది పాల్గొన్నారు.

చదవండి: సూకీకి 5 లక్షల డాలర్లు లంచమిచ్చా
ఎల్‌బీనగర్‌ వ్యభిచారం గుట్టురట్టు

మరిన్ని వార్తలు