హోంమంత్రి వాహనం తనిఖీ.. సహకరించిన మంత్రి

9 Nov, 2023 09:38 IST|Sakshi
హోంమంత్రి వాహనాన్ని తనిఖీ చేస్తున్న పోలీసులు

కొత్తకోట రూరల్‌: వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్వహిస్తున్న మైనార్టీ ఆత్మీయ సమ్మేళనానికి వెళ్తున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ వాహనాన్ని పెద్దమందడి మండలం వెల్టూర్‌ స్టేజీ సమీపంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద బుధవారం ఎస్‌ఐ హరిప్రసాద్‌ తనిఖీ చేశారు. పోలీసులు వాహనాన్ని ఆపడంతో హోం మంత్రి దిగి పోలీసులకు సహకరించారు. వాహనాన్ని పరిశీలించి పంపించారు.

తనిఖీల్లో నగదు సీజ్‌
నారాయణపేట రూరల్‌:
మండలంలోని జలాల్‌పూర్‌ చెక్‌పోస్టు వద్ద తనిఖీ నిర్వహిస్తున్న పోలీసులకు ఒక వాహనంలో రూ.90,500నగదు గుర్తించినట్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపారు. అక్కడ విధుల్లో ఉన్న సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వేమన ఆధ్వర్యంలో వాటిని సీజ్‌ చేసి గ్రీవియన్‌ కమిటీకి పంపించినట్లు తెలిపారు.

కొత్తకోట రూరల్‌: ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. బుధవారం పెద్దమందడి మండలం మోజర్ల వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులో వాహనాలను తనిఖీ చేస్తున్నండగా హైదరాబాద్‌ నుంచి వనపర్తి వెళ్తున్న పుల్లయ్య కారును అపి తనిఖీ చేయడంతో రూ.1,10,000 నగదు లభించింది. నగదుకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో పోలీసులు సీజ్‌ చేశారు. అదేవిధంగా కామారెడ్డి నుంచి వనపర్తికి కారులో వెళ్తున్న రాజు నుండి రూ.50,500 నగదు లభించింది. ఎలాంటి అనుమతులు లేకపోడంతో సీజ్‌ చేసినట్టు ఎస్‌ఐ హరిప్రసాద్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు