ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు..

27 Sep, 2020 12:26 IST|Sakshi

సాక్షి, విజయవాడ: పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. గంట గంటకు నీటి ప్రవాహం పెరుగుతుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇన్ ఫ్లో 4లక్షల 2 వేల  క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో  3లక్షల 97వేల క్యూసెక్కులుగా కొనసాగుతుంది. 70 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాయంత్రనికి 6 లక్షల క్యూసెక్కులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా