కందుకూరు ఘటనపై కేసు నమోదు.. హోంమంత్రి వనిత ఏమన్నారంటే?

29 Dec, 2022 15:48 IST|Sakshi

సాక్షి, కొవ్వూరు: నెల్లూరు జిల్లా కందుకూరు వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్‌ షోలో విషాదం నెలకొన్ని విషయం తెలిసిందే. దురదృష్టవశాత్తు అక్కడ జరిగిన సభలో ఎనిమిది మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. కాగా, ఈ ఘటనపై హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

ఈ సందర్భంగా మంత్రి వనిత మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే ఈ విషాద ఘటన జరిగింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు సీఎం అని చెప్పుకునే చంద్రబాబుకు రాత్రి పూట, ఇరుకు సందుల్లో సభ నిర్వహించకూడదనే విషయం తెలియదా?. గోదావరి పుష్కరాల్లో కూడా ఇలాగే పబ్లిసిటీ పిచ్చితో 29 మంది ప్రాణాలను బలితీసుకున్నారు.

చంద్రబాబుకు ఇదేమి పబ్లిసిటీ పిచ్చి అని ప్రజలందరూ ఇదేమి కర్మరా బాబు అని బాధపడుతున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుంటే తమ్ముళ్లు ఇక్కడే ఉండండి, మళ్ళీ వచ్చి మాట్లాడతానని చంద్రబాబు చెప్పడం వెనుక అర్థం ఏమిటి?. చంద్రబాబు ఎలాగైనా ప్రజల నుండి సానుభూతిని పొందాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కందుకూరు ఘటనపై కేసు నమోదు చేశాము అని తెలిపారు.

మరిన్ని వార్తలు