వ్యవసాయ ట్రాక్టర్ల అమ్మకాల్లో భారీ వృద్ధి 

4 Sep, 2023 06:24 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయ ట్రాక్టర్ల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. 2021–22తో పోల్చి చూస్తే 2022–23లో వ్యవసాయ ట్రాక్టర్ల అమ్మకాల్లో ఏకంగా 82.14 శాతం వృద్ధి నమోదయ్యింది. 2021–22లో 19,259 వ్యవసాయ ట్రాక్టర్లను రైతులు కొనుగోలు చేయగా.. 2022–23లో ఏకంగా 35,079 వ్యవసాయ ట్రాక్టర్లు అమ్ముడయ్యాయి.

వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించడంతో పాటు రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గించడం ద్వారా ఎక్కువ ఆదాయం సమకూర్చడమే లక్ష్యంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం ద్వారా ప్రభుత్వం ఇప్పటివరకు సబ్సిడీ రూపంలో రూ.1,052 కోట్లు వెచి్చంచి రైతులకు లబ్ధి చేకూర్చింది.

దీంతో రాష్ట్రంలో వ్యవసాయ ట్రాక్టర్ల కొనుగోళ్లు భారీగా పెరిగాయని రవాణా శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్రతి ఆర్బీకే పరిధిలోనూ రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలను ప్రభుత్వమే సబ్సిడీపై అందిస్తోంది.  బ్యాంకుల ద్వారా  రుణాలు అందేలా చూస్తోంది. 

మరిన్ని వార్తలు