ముళ్ల పొదల్లో, గండు చీమల మధ్య.. చిన్నారి విలవిల 

22 Jun, 2021 09:06 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి

రక్షించిన స్థానికులు.. విజయవాడలో ఘటన  

చిట్టినగర్‌ (విజయవాడ పశ్చిమ): అర్ధరాత్రి నుంచి చిన్నారి ఏడుపు సమీపంలోని వారికి వినిపిస్తూనే ఉంది.. ఎవరో ఇంట్లో పసిబిడ్డ ఏడుస్తుందిలే అనుకున్నారు. కానీ చిన్నారి ఏడుపు తెల్లవారు జాము కూడా వినిపించడంతో పలువురు లేచి చుట్టుపక్కల వెతికి ముళ్లపొదల్లో గండుచీమల మధ్య ఉన్న పాపను గుర్తించి సపర్యలు చేశారు. కృష్ణా జిల్లా విజయవాడ కొత్తపేట ఆంజనేయవాగు కొండపై భాగంలోని బ్రహ్మంగారి మఠం వద్ద సోమవారం తెల్లవారుజామున ఈ చిన్నారి ఘటన కలకలం రేపింది. అప్పుడే పుట్టిన బిడ్డను ఎవరో అక్కడ పడేసినట్టు భావిస్తున్నారు. వెంటనే చిన్నారిని ప్రభుత్వాస్పత్రికి తరలించగా, ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. అనంతరం స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
చదవండి: ప్రేమికులపై దాడి ఘటన హేయం: గౌతం సవాంగ్‌

మరిన్ని వార్తలు