గాయత్రి దేవిగా దుర్గమ్మ దర్శనం

19 Oct, 2020 08:55 IST|Sakshi

సాక్షి, ఇంద్రకీలాద్రి/ శ్రీశైలం ‌: ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. దేవి శరన్నవరాత్రులలో భాగంగా మూడో రోజైన ఆశ్వయుజ శుద్ధ తదియ నాడు కనకదుర్గ అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా, వేద మాతగా ప్రసిద్ది పొంది∙ముక్తా, విద్రమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ  పంచ ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రిదేవి. చదవండి: శరన్నవరాత్రి అమ్మవారి అలంకారాలు ఇవే

ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మ, హృదయం నందు విష్ణువు,  శిఖయందు రుద్రడు నివసిస్తుండగా త్రిమూర్తత్యంశగా గాయత్రిదేవి వెలుగొందుచున్నది. సమస్త దేవతా మంత్రాలకీ గాయత్రి మంత్రంతో అనుబంధం ఉంది. గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆయా దేవుళ్లకి అన్నాదులు, ప్రసాదాలు నివేదన చేయబడతాయి.  ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీమాతగా వేదమాతగా కొలుస్తూ, గాయత్రిమాతను దర్శించుకోవడం వలన మంత్రిసిద్ధి ఫలాన్ని పొందుతారు. చదవండి: నవరాత్రులు.. నవ వర్ణాలు

ముక్తా విద్రుడు హేమ నీల
దవళచ్‌ఛాౖయె ర్ముఖై స్త్రీక్షణైః 
యుక్తా మిందునిబద్ధరత్నమకుటాం 
తత్వార్థవర్ణాత్మికామ్, 
గాయత్రీం వరదాభయంకుశకశాం  
శుభ్రం కపాలం గదాం 
శంఖం చక్ర మదారవింద యుగళం
హస్తైర్వహంతీం భజే 

మయూర వాహనంపై ఆది దంపతులు
శ్రీశైల మహాక్షేత్రంలో నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజైన ఆదివారం భ్రమరాంబాదేవి అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే స్వామి, అమ్మవార్లను మయూర వాహనంపై కొలువుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అలరించిన కేరళ వాయిద్యకారుల ప్రదర్శన
ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి ప్రతి నిత్యం ఆలయ ప్రాంగణంలో కళార్చన జరుగుతుంది. కేరళకు చెందిన పలువురు వాయిద్యకారులు డప్పు వాయిద్యాలతో తమ కళను ప్రదర్శిస్తున్నారు. సుమారు రెండు గంటల పాటు సాగుతున్న కళార్చన విశేషంగా ఆకట్టుకుంటుంది. సాయంత్రం అమ్మవారికి పంచహారతుల అనంతరం గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు నిర్వహిస్తున్న పల్లకీ సేవలో పంచవాయిద్యాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా