టిడిపి అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు

7 Sep, 2023 14:59 IST|Sakshi

గుంటూరు: చంద్రబాబు నాయుడు తనను అరెస్టు చేస్తారని చెప్పుకుంటూ ప్రజల్లో సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తున్నారని..  తప్పుచేశారు కాబట్టే ఆయన భయపడుతున్నారని అన్నారు మంత్రి అంబటి రాంబాబు.  

చంద్రబాబు అధికారంలో ఉండగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడిన నేరానికి ఐటీశాఖ నోటీసులు జారీ చేసిన విషయం  తెలిసిందే. దీంతో అరెస్టు భయం పుట్టుకున్న చంద్రబాబు ప్రజల వద్ద సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు అంబటి రాంబాబు. 

చట్టం దృష్టిలో చంద్రబాబు అయినా ఒకటే మరో బాబు అయిన ఒకటేనని చట్టం తన పని తాను చేసుకుంటూపోతుందని ఆయన తప్పు చేశాడు కాబట్టే భయపడుతున్నారని నాకు అనిపిస్తోందన్నారు. బహుశా ఆయనను అరెస్ట్ చేస్తారని ఆయనకు కలవచ్చినట్టుంది. 
చంద్రబాబును అరెస్టు చేయాల్సిన అవసరం ఉంటే అరెస్టు చేస్తారు, అరెస్టు చేయాల్సిన అవసరం లేకపోతే అరెస్టు చేయరని అన్నారు. 



 

అలాగని చట్టానికి అడ్డం వస్తే ఆయన్ని తప్పకుండా అరెస్టు చేస్తారని ప్రాథమిక ఆధారాలు లేనిదే ఎవరి మీద ఏ విధమైన కేసులు పెట్టరని అన్నారు. దీనిని అవకాశంగా తీసుకుని చంద్రబాబు ప్రజల్లో సానుభూతి పొందే మాటలు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు దొంగైనా పవన్ కళ్యాణ్  నోరు విప్పడు. చంద్రబాబు రూ. 118 కోట్లు ముడుపులు తీసుకున్నారన్న ఆధారాలున్నా కూడా పవన్ కళ్యాణ్ నోరు విప్పడు సరికదా ఆయన హీరోనే అంటాడని వాళ్ళిద్దరికీ ఉన్న సంబంధం అలాంటిదని వ్యాఖ్యానించారు.

మాజీ మంత్రి కొడాలి నాని కామెంట్స్
ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులిచ్చిన ఇదే అంశంపై మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ తప్పు చేస్తే అరెస్టు చేయక ముద్దుపెట్టుకుంటారా అని ప్రశ్నించారు.   

అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి పనులు చేస్తే అరెస్ట్ చెయ్యక ముద్దు పెట్టుకుంటారా? ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. పాలు అమ్మితే పదివేల కోట్ల ఆదాయం వచ్చిందా.. పాలు, పిడకలు అమ్మి దేశంలో ఎవరూ ఇంత ఆదాయం సంపాదించలేదని దోచుకున్న డబ్బును వైట్ చేసేందుకే చంద్రబాబు పాల వ్యాపారం చేస్తున్నార్నయి అన్నారు. .

అధికారంలో ఉన్నప్పుడు మనం చేసిన మంచి పనులు ఏవైనా ఉంటే వాటి గురించి ప్రజలు చెప్పాలి..  అంతే తప్ప చంద్రబాబు  సెల్ఫీలు తీసుకొని అన్నీ నేనే చేశానని చెప్పుకోవడమేంటో నాకైతే అర్ధం కాలేదన్నారు. మాట్లాడితే హైదరాబాద్ నేనే కట్టానంటారు  కానీ చంద్రబాబు అక్కడ పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదన్నారు. పిట్టలదొర లేని లోటుని ఆయన తీరుస్తున్నారని రాష్ట్రంలో ఐదుగురు వ్యక్తులు మాత్రమే సంపదని దోచుకోవాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. 

ఇది కూడా చదవండి: మార్గదర్శి మా జీవితాల్ని నాశనం చేసింది: బాధితురాలు

మరిన్ని వార్తలు