యజ్ఞం తలపెడితే రాక్షసులు అడ్డుకుంటున్నారు..

7 Nov, 2020 12:56 IST|Sakshi

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా

‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ రెండో విడత ప్రారంభం

సాక్షి, విజయవాడ: కులాల మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టి కాపులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ధ్వజమెత్తారు.  శనివారం ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ రెండో విడత కార్యక్రమాన్ని కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజాతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్‌ మాట్లాడుతూ అర్హులను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కాపు నేస్తం పథకం ద్వారా కాపుల్లో వెనుకబడిన వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. (చదవండి: 56 బీసీ కార్పొరేషన్లకు 672 మంది డైరెక్టర్లు)

‘‘కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయమంటే కేసులు పెట్టి కాపు ఉద్యమకారులను చంద్రబాబు జైళ్లలోకి నెట్టారు. పేదలు ఎవరూ పేదరికంలో మగ్గిపోకూడదని సంక్షేమ పథకాల సంస్కరణలను సీఎం జగన్‌ అమలు చేస్తున్నారు. కాపు నేస్తం పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం అమలు అయ్యేలా చర్యలు చేపడుతున్నాం. కాపులను బీసీల్లో చేరుస్తామని సాధ్యం కాని హామీలు ఇచ్చి చంద్రబాబు కాపులను మోసం చేశారు. ఆచరణ సాధ్యం కాని హామీలను నాడు జగన్ ఇవ్వలేదు. స్వార్థం కోసం పథకాలను చంద్రబాబు అమలు చేశారు. 5548 కోట్లు ప్రత్యక్ష లబ్ధిదారులకు అందేలా కాపు నేస్తం పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తుంది. దేవతలు యజ్ఞం తలపెడితే రాక్షసులు అడ్డుపడినట్లు రాష్ట్రంలో చంద్రబాబు అడ్డుపడుతున్నారని’’ వేణుగోపాల్‌ మండిపడ్డారు. (చదవండి: తూర్పులో వేణునాదం)

చంద్రబాబు మోసం చేశారు..
జక్కంపూడి రాజా మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. 5 వేల కోట్లు కాపులకు కేటాయిస్తామని ఇచ్చిన  హామీని చంద్రబాబు విస్మరించారని, అమలు చేయమంటే కేసులు పెట్టి జైళ్లలో పెట్టారని మండిపడ్డారు.  ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు అనుగుణంగా కాపుల సంక్షేమం కోసం సంవత్సరానికి 2 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు