షాకింగ్‌.. టాయిలెట్‌ వాటర్‌తో పానీపూరి

7 Nov, 2020 12:56 IST|Sakshi

ముంబై: పానీ పూరి దేశవ్యాప్తంగా అందరికి ఇష్టమైన చిరుతిండి. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఈ స్నాక్‌ ఐటం ప్రస్తుతం గ్రామాల్లో కూడా లభిస్తుంది. కరోనాతో ప్రస్తుతం చాలా మంది జనాలు బయటి ఆహారం తీసుకోవాలంటనే ఒణుకుతున్నారు. దాంతో ఇప్పుడు పానీపూరికి గిరాకి బాగా తగ్గిపోయింది. ఒకప్పుడు సాయంత్రం అయితే చాలు రోడ్డుకు ఇరువైపులా పానీపూరి బళ్లు.. దాని చుట్టూ జనాలు కిక్కిరిసి ఉండేవారు. మధ్యాహ్నం మొదలయ్యే ఈ వ్యాపారం రాత్రి పది వరకు కూడా నడిచేది. ఇక చిన్న పిల్లలు మొదలు.. ముసలి వారు వరకు ఇష్టంగా తినేవారు. మరో విశేషం ఏంటంటే పానీపూరి వ్యాపారంలో కల్తీకి సంబంధించి ఎన్ని వార్తలు వచ్చిన గిరాకీ మాత్రం తగ్గేది కాదు. మరి ఇప్పుడు ఈ వార్త చదివిన తర్వత అయినా జనాల్లో మార్పు వస్తుందో లేదో చూడాలి. తాజాగా ఓ పానీ పూరీ బండి వ్యక్తి టాయిలెట్‌ వినియోగం కోసం ఉంచిన నీటిని తెచ్చి.. పానీపూరికి వాడే రసంలో కలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో జనాలు అతడిని చితకబాదారు. (చదవండి: ప్రాణం తీసిన గప్‌చుప్)

ఈ ఘటన కొల్హాపూర్‌లో చోటు చేసుకుంది. పట్టణంలోని రంకాల లేక్‌ సమీపంలో ‘ముంబై కా స్పెషల్‌ పానీ పూరి వాలా’ పేరుతో నడిచే ఈ పానీ పూరి బండి ఆ ప్రాంతంలో తెగ ఫెమస్‌. సాయంత్రం అయ్యిందంటే చాలు.. పానీ పూరి కోసం జనాలు బండి దగ్గర క్యూ కడతారు. ఈ క్రమంలో ఓ రోజు సదరు పానీ పూరి బండి వ్యక్తి రోడ్డు పక్కన టాయిలెట్‌ బయట ఉన్న నీటిని తెచ్చి పానీపూరి రసంలో మిక్స్‌ చేశాడు. అయితే అతడి నిర్వకాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వీడియో చూసిన జనాలు ఆగ్రహంతో అతడి బండిని కిందపడేసి.. వస్తువులను నాశనం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. ఇంట్లో ఎంతో శుభ్రంగా, రుచిగా చేసిపెట్టినప్పటికి కొందరికి మాత్రం బయటి తిండే రుచిగా అనిపిస్తుంది. అలాంటి వారు ఇది చదివాకైనా మారితే మంచిది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు