ఆక్రమణల చిట్టా బయట పెట్టినందుకే..

24 Dec, 2020 11:51 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం, కడప : గౌతు లచ్చన్న విగ్రహంపై టీడీపీ దిగజారుడు రాజకీయం చేస్తోందని మంత్రి  సీదిరి అప్పలరాజు అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడైన గౌతు లచ్చన్నను ఏ ఒక్క వర్గానికో పరిమితం చేయడం సరికాదన్నారు. విగ్రహాన్ని తొలిగిస్తామని ఎక్కడా చెప్పలేదని, తాను అన్నట్లుగా టీడీపీ నేతలు వక్రీకరించారని పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రిందట టిడిపి నేత కూన రవికుమార్, గౌతు శీరిషా మీడియా సమావేశం నిర్వహించారని, భూముల ఆక్రమణ కోసం టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన  విగ్రహానికి ఎటువంటి ముప్పు ఉండదని, గ్రామంలోని  ప్రభుత్వ స్థలంలోగౌతు లచ్చన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం అని మంత్రి  స్పష్టం చేశారు.  (రాయపాటి లూటీలో బాబు వాటా ఎంత? )

తెరమీదకు సర్ధార్ గౌతు లచ్చన్న విగ్రహ అంశం
'టీడీపీ హయంలో ముత్యాలమ్మ కోనేరు వద్ద దేవదాయ భూమిని కబ్జా చేసి  వాహనాల షోరూమ్‌ను  నిర్మించారు.  దీనిలో భాగంగా ఆక్రమించిన దేవాదాయ భూమిలో రెండేళ్ళ క్రిందట టీడీపీ నేతలు సర్ధార్ గౌతు లచ్చన్న విగ్రహన్ని ప్రతిష్టించారు. నా  అండదండలతో పలాసలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయని కొద్ది రోజుల కిందట  ఎంపి రామ్మోహన్ నాయుడు ఆరోపణలు చేయడంతో  టిడిపి హయంలో జరిగిన భూ ఆక్రమణల చిట్టాను మీడియా ముందు బయట పె‍ట్టగా, అధికారులు వాటిని  తొలిగించారు.  ఇది సహించలేని  టీడీపీ నేతలు గౌతు లచ్చన్న విగ్రహన్ని నేను తొలగిస్తానంటూ అసత్య  ప్రకటన చేశారు. ఇందులో వాస్తవం లేదు. గౌతు లచ్చన్నపై తమకు  ఎంతో అభిమానం ఉంది. ఈ విషయంలో టీడీపీ నేతలు రాజకీయాలు మానుకోవాలి' అంటూ మంత్రి హితవు పలికారు. 

పలాసలో వైఎస్సార్‌సీపీ  నేతల అరెస్ట్
గౌతు లచ్చన్న విగ్రహ అంశంపై నిరసన కార్యక్రమం చేస్తామని టీడీపీ నేతలు ఇదివరకే ప్రకటించారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా టీడీపీ  నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కాగా టిడిపి దుష్టరాజకీయాలను ఖండిస్తూ గౌతు లచ్చన్న విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ  నేతలు నిరసనకు యత్నించారు. గౌతు లచ్చన్న అందరి నాయకుడని, ఆయన్ను టీడీపీ పార్టీకి కానీ, ఓ కులానికి కానీ పరిమితం చేయ్యోద్దని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు అనుమతి లేకపోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. (‘నన్ను చూసి నవ్వుతావంట్రా.. ఎంత ధైర్యంరా నీకు’ )

మరిన్ని వార్తలు