ఏపీ సీఐడీ చీఫ్‌గా ఎన్‌ సంజయ్‌.. సునీల్‌కుమార్‌కు బదిలీ

23 Jan, 2023 19:25 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ డీజీగా ఎన్‌ సంజయ్‌ ఐపీఎస్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఆయన ఫైర్‌ సర్వీసెస్‌(విపత్తు నిర్వహణ) డీజీగా విధులు నిర్వర్తిస్తున్నారు. 

అదే సమయంలో ప్రస్తుతం సీఐడీ చీఫ్‌గా ఉన్న పీవీ సునీల్‌ కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. సాధారణ పరిపాలనా శాఖ(జీఏడీ)లో రిపోర్ట్‌ చేయాలని సునీల్‌కుమార్‌ను ఆదేశించింది. అంతర్గత బదిలీలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు