పోలవరానికి రూ.2,234.28 కోట్లు విడుదల

5 Dec, 2020 10:00 IST|Sakshi

సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు కోసం రూ.2,234.28 కోట్లను నాబార్డు శుక్రవారం జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్యూడీఏ)కు విడుదల చేసింది. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రీయింబర్స్‌మెంట్‌ కింద ఎన్‌డబ్యూడీఏ ఆ మొత్తాన్ని విడుదల చేయనుంది. పోలవరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రత్యేక ఖాతాలో ఒకట్రెండు రోజుల్లో జమ చేయనుంది.  కాగా 3, 4 రోజుల్లో నిధులు ఏపీ ప్రభుత్వ ఖాతాలో జమ కానున్నాయి . ఇప్పటివరకు రూ.8,507 కోట్లు విడుదల చేసిన కేంద్రం.. ఇంకా రూ.1788 కోట్లు విడుదల చేయాల్సి ఉంది.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా