సీఎం మార్క్‌ బ్రాండ్‌ సిటీ

21 Dec, 2023 06:05 IST|Sakshi

నాలుగున్నరేళ్లలో విశాఖకు కొత్త రూపు

ఐటీ, గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్, జీ20 సదస్సుతో పెరిగిన ఇమేజ్‌

అంతర్జాతీయ గుర్తింపుతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన నగరం

పెట్టుబడుల స్వర్గధామంగా మార్పు

సక్సెస్‌ మంత్రంగా బీచ్‌ ఐటీ కాన్సెప్ట్‌

ఇన్ఫోసిస్, విప్రో తదితర సంస్థలతో కళకళ

నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రత్యేక దృష్టి

ప్రజల్ని సరికొత్తగా పలకరిస్తున్న రహదారులు, పార్కులు 

ఎన్‌ఎడీ ఫ్లైఓవర్‌ పూర్తి.. సిరిపురం జంక్షన్‌లో జోరుగా మల్టీ లెవల్‌ కార్‌ పార్కింగ్‌ పనులు 

జీవీఎంసీ పరిధిలో రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు

సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి   :  సువిశాల సాగరతీరం చెంతనే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఐటీ పరిశ్రమల్ని అభివృద్ధి చేసి.. సిటీ ఆఫ్‌ డెస్టినీని ఐటీ హబ్‌గా మార్చాలనే ఉద్దేశంతో.. బీచ్‌ ఐటీ కాన్సెప్ట్‌ని తొలుత ప్రమోట్‌ చేయాలని భావించారు. ఇందులో భాగంగానే ఇన్ఫోసిస్, టెక్‌మహీంద్ర, హెచ్‌సీఎల్, యాక్సెంచర్, రాండ్‌స్టాడ్, డబ్ల్యూఎన్‌ఎస్, అమేజాన్‌ తదితర ఐటీ, ఐటీ అనుబంధ దిగ్గజ సంస్థలు విశాఖ వైపు అడుగులు వేశాయి. వర్చువల్‌ డెస్క్‌టాప్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌(వీడీఐ), క్లౌడ్‌ ప్రాజెక్టులకు కేంద్రంగా విశాఖ క్యాంపస్‌ని మార్చాలని విప్రో నిర్ణయించింది.

విశాఖలో స్టార్టప్‌ల ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీస్‌(నాస్కామ్‌) సీఈవో సంజీవ్‌ మల్హోత్రా ప్రకటించారు. ఐటీ రంగంలో తిరుగులేని నగరంగా విశాఖపట్నంని అభివృద్ధి చేసేందుకు ఇక్కడే ఐటీ ఎమర్జింగ్‌ టెక్నాలజీ రీసెర్చ్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఐటీ పరిశోధనలు, అభివృద్ధిలో భాగంగా.. ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ ఎకోసిస్టమ్‌ని ఏర్పాటు చేయ­నున్నారు. ఇందుకు కేంబ్రిడ్జిలోని మసాచుసెట్స్‌ ఇనిస్టి­ట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ) సహకారంతో పాటు సంయుక్త సర్టిఫికేషన్‌ కోర్సుల్ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది.

అమెరికాకు చెందిన ప్రముఖ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ సంస్థ చెగ్‌.. విశాఖలో కొత్త బ్రాంచ్‌ని ప్రారంభించింది. అదానీ డేటా సెంటర్‌ ఏర్పాటుకు సీఎం వైఎస్‌ జగన్‌ స్వయంగా శంకుస్థాపన చేశారు. వైజాగ్‌ టెక్‌ పార్క్‌ కూడా డేటా సెంటర్‌తో పాటు బిజినెస్‌ పార్క్, స్కిల్‌ యూనివర్సిటీని రూ.21,844 కోట్ల పెట్టుబడితో 39,815 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముందుకు వచ్చింది. గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఎన్టీపీసీ, ఇంధన రంగంలో హెచ్‌పీసీఎల్, పర్యాటక రంగంలో ఒబెరాయ్, తాజ్, ఇనార్బిట్‌మాల్, టర్బో ఏవియేషన్‌.. ఇలా.. విభిన్న రంగాల్లో బహుళ ప్రాజెక్టుల్ని ఏర్పాటు చేస్తున్నారు.

టైర్‌–1 సిటీలతో పోటీ
నీతి ఆయోగ్‌ ఇటీవల వెల్లడించిన పట్టణ సుస్థిర అభివృద్ధి సూచిక ర్యాంకుల్లో విశాఖకు 18వ ర్యాంకు సాధించింది. దేశంలోని రాష్ట్రాల రాజధానులు, 10 లక్షల జనాభా పైబడిన నగరాలు.. మొత్తంగా 56 నగరాలకు ఈ ర్యాంకులు ఇచ్చారు. టైర్‌–1 సిటీల కంటే ద్వితీయ శ్రేణిలో ఉన్న వైజాగ్‌.. అందర్నీ ఆకర్షిస్తోంది. స్మార్ట్‌ సిటీ ర్యాంకింగ్‌లోనూ సత్తా చాటుతోంది. 2018–19లో 23వ ర్యాంకులో ఉన్న నగరం ఆ తర్వాత వరుసగా టాప్‌–10లోనే కొనసాగుతోంది. ఈ ఏడాది క్లైమేట్‌ స్మార్ట్‌ సిటీ ఫ్రేమ్‌ వర్క్‌లో 4 స్టార్‌ రేటింగ్‌ సాధించింది.

ఐటీ ఉద్యోగాల జోరు..
రాష్ట్రంలోని ఐటీ రంగంలో 2014–19 కాలంలో 24,350 ఐటీ ఉద్యోగాల కల్పన జరిగితే ఆ తర్వాత రెండేళ్లు కోవిడ్‌ వంటి కష్టకాలం ఉన్నప్పటికీ ఈ నాలుగున్నర ఏళ్లల్లో కొత్తగా 29,500 ఉద్యోగాలు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల సంఖ్య 53,850కు చేరింది.  

♦ డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్న అదానీ, ఎస్‌క్యూఎల్‌ సంస్థలు 
♦  భారీ ఐటీ పార్కులు  నిర్మి స్తున్న అదానీ, రహేజా, ఏపీఐఐసీ  
♦  గడిచిన నాలుగున్నర ఏళ్లలో కొత్తగా 29,500 ఐటీ  ఉద్యోగాలు \
♦  విశాఖ కేంద్రంగా ఇన్ఫోసిస్, విప్రో, రాండ్‌స్టడ్, బీఈఎల్‌ కార్యకలాపాలు  
♦  ఇప్పటికే ఉన్న సంస్థలు భారీ విస్తరణ ప్రణాళికలు 
♦  ఎమర్జింగ్‌ ఐటీ సిటీగా విశాఖ
♦  విశాఖకు కంపెనీలు ఆకర్షించే విధంగా బీచ్‌ ఐటీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం

>
మరిన్ని వార్తలు