సాక్షి ఎఫెక్ట్‌: పెట్రోల్‌ బంకుల్లో అధికారుల తనిఖీలు 

14 Sep, 2021 09:27 IST|Sakshi
విజయవాడలోని బంకులో తనిఖీ చేస్తున్న అధికారులు

రాష్ట్రవ్యాప్తంగా 157 పెట్రోల్‌ బంకుల పరిశీలన

సాక్షి, అమరావతి: పెట్రోల్‌ బంకుల్లో చిప్‌లు ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడుతున్న తీరుపై ‘కనికట్టు కొలత’ శీర్షికన సోమవారం ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై తూనికలు–కొలతల శాఖ స్పందించింది. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్‌ బంకుల్లో తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. దీంతో అసిస్టెంట్‌ కంట్రోలర్‌ కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో విజయవాడలోని 7 పెట్రోల్‌ బంకులను అధికారులు తనిఖీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 150కిపైగా బంకులను పరిశీలించారు. పెట్రోల్‌ కొలతలు, నాణ్యతను పరీక్షించి రికార్డులను చూశారు. వారం పాటు ఈ తనిఖీలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఆకస్మిక తనిఖీలు చేయాలని నిర్ణయించారు.

చదవండి:
కనికట్టు కొలత.. బంకుల్లో పెట్రోల్‌ కాజేస్తున్న చిప్‌లు  

మరిన్ని వార్తలు