ప్రజల చెంతకే పాలన... జగనన్నతోనే సాధ్యం

23 Jun, 2022 12:15 IST|Sakshi

డుంబ్రిగుడ: ప్రజల చెంతకే పాలన అందించడం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ అన్నారు. అరకు పంచాయతీ మాడగడ ,అరకు సంతబయలు గ్రామాల్లో బుధవారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో 355 గడపలను సందర్శించారు. ఇంటింటికీ వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతీరుపై ఆరా తీశారు.

ఎమ్మెల్యే పాల్గుణ మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీలకతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తూ, దేశానికి ఆదర్శనీయమంగా నిలిచారన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల చెంతకే పాలన తీసుకొచ్చారని, నాడు–నేడు ద్వారా విద్యా వ్యవస్థలో అనూహ్య మార్పులు తీసుకొచ్చారన్నారు. ఈ సందర్భంగా అరకు గ్రామంలో డ్రైనేజీ, రోడ్డు సమస్యలను స్థానికులు ఎమ్మెల్యేకు వివరించారు. ఆయన స్పందించి ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం కోసం సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

గ్రామాల్లో పర్యటించి అర్హులందరికీ పథకాలు అందేలా చూడాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.  ఎంపీపీ బాక ఈశ్వరి, జెడ్పీటీసీ జానకమ్మ, వైస్‌ ఎంపీపీలు ఆనంద్, లలిత, ఎంపీటీసీలు వరహాలమ్మ,  విజయ, సర్పంచ్‌లు శారద, నాగేశ్వరరావు, రామ్మూర్తి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజరమేష్, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు గోపాల్, మార్కెట్‌ కమీటీ చైర్మన్‌ రాజరమేష్,పీఏసీఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జి నాయుడు, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ సొర్రు, బీసీ సెల్‌ అద్యక్షుడు మురళీ, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. 

(చదవండి: నమ్మించి.. రియల్టర్‌ కిడ్నాప్‌)

మరిన్ని వార్తలు