ఏపీలో రేపు, ఎల్లుండి వర్షాలు

6 Dec, 2020 16:38 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు రోజులు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. రేపు(సోమవారం) ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో మోస్తరు భారీ వర్షాలు.. కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఎల్లుండి (మంగళవారం) నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు భారీ వర్షాలు.. ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి వర్షాలు  పడే అవకాశముందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కన్నబాబు తెలిపారు.

మరిన్ని వార్తలు