523 పంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవం

5 Feb, 2021 07:33 IST|Sakshi

ఒక్కో అభ్యర్థే నామినేషన్‌ వేయడంతో ఏకగ్రీవ వివరాలు వెల్లడించిన అధికారులు

అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 110 సర్పంచ్‌లు ఏకగ్రీవం

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా తొలివిడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 523 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలివిడత ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. 3,249 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్‌ జారీ కాగా.. సర్పంచ్‌ పదవుల కోసం 19,491, వార్డు సభ్యుల కోసం 79,799 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో సర్పంచ్‌ ఎన్నికలకు సంబంధించి 1,323 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. (చదవండి: స్థానిక ఎన్నికలు: టీడీపీ నేతల దౌర్జన్యకాండ)

18,168 మాత్రం సక్రమంగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. తొలి విడతలో విజయనగరం జిల్లా లేదు. మిగిలిన 12 జిల్లాలను పరిశీలిస్తే.. తొలి విడతలో ఎన్నికలు జరిగే పంచాయతీలు చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 454 ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో అత్యల్పంగా 163 పంచాయతీలున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 110 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యారు. అనంతపురం జిల్లాలో అత్యల్పంగా ఆరుగురు సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యారు. అలాగే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 2,499 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పంచాయతీలు, వార్డులకు ఈ నెల 9న పోలింగ్‌ జరగనుంది.(చదవండి: టీడీపీ కిడ్నాప్ డ్రామా బట్టబయలు..)
   

మరిన్ని వార్తలు