మంత్రుల బాధ్యతల స్వీకరణ

30 Jul, 2020 04:15 IST|Sakshi
బాధ్యతలు స్వీకరించిన మంత్రులు శంకర్‌ నారాయణ, శ్రీనివాస వేణుగోపాలకృష్ణ

ఆర్‌ అండ్‌ బీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శంకర్‌ నారాయణ

బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ

సాక్షి, అమరావతి: రోడ్లు, భవనాల (ఆర్‌ అండ్‌ బీ) శాఖ మంత్రిగా శంకర్‌ నారాయణ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రిగా చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణలు బుధవారం సచివాలయంలో వేర్వేరుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్‌ నారాయణ మాట్లాడుతూ బీసీ సంక్షేమ శాఖ నుంచి ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రిగా బాధ్యతలను తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ చెట్లెక్కే మా చేత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పార్లమెంట్‌ మెట్లెక్కించారన్నారు. 

► ఈ సందర్భంగా మంత్రి శంకర్‌ నారాయణ రెండు కీలక ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 వేల కి.మీ. రోడ్లు వేసేందుకు గాను రూ.6,400 కోట్లతో ఎన్డీబీతో చేసుకున్న ఒప్పందంపై సంతకం చేశారు. తూ.గో. జిల్లాలోని వృద్ధ గౌతమి నదిపై ఎదుర్లంక– జి.ముళ్లపాలెం రహదారి కొత్త వంతెన పనులకు సంబంధించి రూ.76.05 కోట్లకు అంచనాలను సవరిస్తూ ఫైల్‌పైనా సంతకం చేశారు. 
► మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కర్నూలు జిల్లా బేతంచర్ల బీసీ బాలుర రెసిడెన్షియల్‌ స్కూల్, డోన్‌ బీసీ బాలికల రెసిడెన్షియల్‌ స్కూల్‌లను జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ మొదటి ఫైల్‌పై సంతకం చేశారు. 
► బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ కుమార్, డైరెక్టర్‌ బి.రామారావు, కాపు కార్పొరేషన్‌ ఎండీ సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యేలు ధనలక్ష్మి, కంబాల జోగులు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు