శివమొగ్గ – చెన్నై మధ్య బైవీక్లీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌

8 Apr, 2022 15:28 IST|Sakshi

గుంతకల్లు: ప్రయాణికుల సౌకర్యార్థం శివమొగ్గ–చెన్నై సెంట్రల్‌ మధ్య బై వీక్లీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ సీహెచ్‌ రాకేష్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్పెషల్‌ రైలు (నం:06223) శివమొగ్గ నుంచి ప్రతి ఆది, మంగళవారాల్లో బయలుదేరుతుంది. ఈ రైలు ఏప్రిల్‌ 17 నుంచి జూన్‌ 28వ తేదీ వరకు మాత్రమే రాకపోకలు సాగించనుంది. 

అదేవిధంగా తిరుగు ప్రయాణంలో (రైలు నం: 06224) చెన్నై సెంట్రల్‌ నుంచి సోమ, బుధవారాల్లో బయలుదేరుతుంది. ఈ నెల 18 నుంచి జూన్‌ 29వ తేదీ వరకు మాత్రమే ఈ రైలు రాకపోకలు సాగించనుంది. ఈ రైలు శివమొగ్గ, భద్రావతి, తరికెరె, బీరూర్, అజాంపురా, హసదుర్గ, చిక్‌జాజూర్, చిత్రదుర్గ, చెళ్లికెర, మొలకాల్మూరు, రాయదుర్గం, బళ్లారి, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, వైఎస్సార్‌ కడప, రాజంపేట, రేణిగుంట మీదుగా అర్కోణం నుంచి చెన్నై సెంట్రల్‌కు చేరుతుంది. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. 

మరిన్ని వార్తలు