Dec 12th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

12 Dec, 2023 18:22 IST|Sakshi

17a పిటిషన్‌లో ఊరట కోసం చంద్రబాబు ఆరాటం

ముందస్తు అనుమతి లేదన్న వాదనతో సరిపెట్టిన బాబు లాయర్లు

ఏ కేసులోనయినా 17aతోనే ముడిపెట్టాలంటోన్న బాబు లాయర్లు

TDP Chandrababu Cases, Political Updates..

5:25 PM, Dec 12, 2023
మ్యానిఫెస్టోపై ముందుకు పడని అడుగు

  • ఇంకా తుదిదశకు రాని తెలుగుదేశం-జనసేన మ్యానిఫెస్టో
  • మినీ మేనిఫెస్టో పేరిట కుస్తీలు పడుతోన్న టిడిపి నేతలు
  • తెలుగుదేశం ఎజెండాలో ఆరు అంశాలు
  • జనసేన ఎజెండాలో అయిదు అంశాలు
  • ఇప్పటికే పవన్‌ కళ్యాణ్‌తో విడతలవారీగా చర్చలు జరిపిన చంద్రబాబు
  • తెలంగాణ ఎన్నికల తర్వాత మారిన చంద్రబాబు ప్లాన్‌
  • ఏం చేస్తే ఆకట్టుకోవాలనుకునే దానిపై మంతనాలు

మేనిఫెస్టోలో చేర్చిన ఎనిమిది అంశాలు

1. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా అంకుర సంస్థల ఏర్పాటుకు రూ. 10 లక్షల వరకూ రాయితీ
2. ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు.
3. అమరావతే రాజధానిగా కొనసాగింపు.
4. పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం.
5.అసమానతలు తొలిగిపోయి.. ఆర్థిక వ్యవస్థ బాగుపడేలా ప్రణాళికల రూపకల్పన.
6. బీసీలకు రక్షణ చట్టం తీసుకురావడం.
7. రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి బయటకు తీసుకువచ్చే విధానాలపై నిర్ణయం.
8. రద్దు చేసిన సంక్షేమ పథకాలపై పునఃపరిశీలన.

  • ఇంత చేసినా.. మేనిఫెస్టో ప్రజల్లో నెగ్గుతుందన్న దానిపై టిడిపి-జనసేనలో అనుమానాలు
  • ఇలాంటి మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వెళ్తే సీన్‌ రివర్సేనని రెండు పార్టీ నేతల ఆందోళన
  • టిడిపి-జనసేన మేనిఫెస్టో ప్రజల ఆశలకు దూరంగా ఉందంటూ హరిరామజోగయ్య విమర్శలు
  • ఏముందని ఇది ప్రజలను ఆకట్టుకుంటుందని హరిరామజోగయ్య ప్రశ్నలు
  • కొత్తగా 47 సంక్షేమ పథకాలు పెట్టాలంటున్న హరిరామజోగయ్య
  • మరి ఇన్నాళ్లు శ్రీలంకలా మారుతుందని భయపెట్టాం కదా అంటోన్న తెలుగుదేశం నేతలు
  • గెలవాలంటే ఏమైనా చెప్పాల్సిందేనంటూ ఇరుపక్షాల్లో చర్చ
  • 2014లో అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను మాయం చేసిన చంద్రబాబు, తెలుగుదేశం నేతలు

4:45 PM, Dec 12, 2023
చంద్రబాబు కేసులు @ హైకోర్టు

  • హైకోర్టులో చంద్రబాబు కేసుల విచారణ వాయిదా
  • IRR కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ
  • అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు
  • తమ వాదనలు వినిపించేందుకు మరికొంత సమయం కావాలన్న ఏజీ
  • కేసు విచారణ రేపటికి వాయిదా
  • ఇసుక కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ
  • ఏజీ వాదనలు వినిపించేందుకు కేసు విచారణ శుక్రవారానికి వాయిదా

4:31 PM, Dec 12, 2023
విశాఖకు కార్యాలయాల తరలింపును వ్యతిరేకిస్తూ పిటిషన్‌

  • విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలిస్తున్నారంటూ పిటిషన్
  • కార్యాలయాల తరలింపు నిలిపివేయాలని కోరిన రాజధాని పరిరక్షణ సమితి
  • విచారణను సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు

4:22 PM, Dec 12, 2023
చెన్నైకి చంద్రబాబు

  • కాసేపట్లో చెన్నై చేరుకోనున్న చంద్రబాబు
  • చెన్నై నుంచి రోడ్డు మార్గంలో శ్రీపెరంబుదూర్‌కు బాబు
  • రామానుజర్ ఆలయంలో పూజలు నిర్వహించనున్న బాబు
  • అనంతరం మైలాపుర్ లోని చంద్రబాగ్ అవెన్యూ కు
  • అక్కడ నాగాలాండ్ గవర్నర్ ఐలా గణేశన్ ఇంట్లో భేటీ

3:45 PM, Dec 12, 2023
తప్పుడు వార్తలు ఆపండి : ఎల్లో మీడియాకు YSRCP వార్నింగ్‌

  • ప్రభుత్వంపై విషం చిమ్మడమే మీ లక్ష్యమా?
  • చంద్రబాబుకు ప్రయోజనం కలిగించడమే మీకు ఆనందమా?
  • ఇంకెన్ని అబద్దాలు చెబుతారు? ఎన్ని అసత్యాలు ప్రచారం చేస్తారు?

2:55 PM, Dec 12, 2023
ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు @ హైకోర్టు

  • ఏపీ హైకోర్టు:అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసు
  • ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు నాయుడు పిటిషన్పై హైకోర్టులో విచారణ
  • సిఐడి తరఫున వాదన వినిపిస్తున్న అడ్వకేట్ జనరల్ శ్రీరాం

కేసులో అభియోగాలేంటీ?

  • టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు
  • కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే
  • లింగమనేని కుటుంబంతో క్విడ్‌ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్‌ క్యాపిటల్‌లో భూములు
  • స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మూడుసార్లు మార్పు
  • అలైన్‌మెంట్‌ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్‌ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్‌ప్రోకో
  • జూలై 22,2015  & ఏప్రిల్‌ 4, 2017 మరియు అక్టోబరు 31, 2018న ఇన్నర్‌రింగ్‌ అలైన్‌మెంట్‌లో మార్పులు
  • ఇన్నర్‌ రింగ్‌రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు
  • అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం
  • ఇన్నర్‌రింగ్‌ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్‌మెంట్‌
  • కరకట్ట కట్టడం.. క్విడ్‌ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని
  • కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం
  • లింగమనేని రమేశ్‌ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం
  • సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు

2:50 PM, Dec 12, 2023
చంద్రబాబు కేసులు - స్టేటస్‌

చంద్రబాబు కేసుల స్టేటస్‌ ఏంటీ?

కేసు : స్కిల్ కుంభకోణం

  • స్టేటస్‌ : నవంబర్‌ 20న బెయిల్‌ ఇచ్చిన హైకోర్టు
  • వివరణ :  ఆరోగ్య కారణాలతో ఇచ్చిన బెయిల్‌ను సాధారణ బెయిల్‌గా మార్చిన హైకోర్టు
  • కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని సూచించిన హైకోర్టు

కేసు : స్కిల్ స్కాం

  • అంశం : క్వాష్‌ పిటిషన్‌
  • స్టేటస్‌ : సుప్రీంకోర్టులో పెండింగ్‌
  • వివరణ : ఈ నెలలో తీర్పు వచ్చే అవకాశం

కేసు : ఇసుక కుంభకోణం

  • అంశం : చంద్రబాబు ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
  • స్టేటస్‌ : హైకోర్టులో జరుగుతున్న విచారణ
  • వివరణ : డిసెంబర్‌ 12 (ఈ రోజు) విచారణ

 
కేసు : ఫైబర్‌ నెట్‌ పేరిట నిధుల దోపిడి

  • అంశం : ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
  • స్టేటస్‌ : సుప్రీంకోర్టులో పెండింగ్‌
  • వివరణ : జనవరి 17కు తదుపరి విచారణ వాయిదా

కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు

  • అంశం : ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
  • స్టేటస్‌ : మంజూరు చేసిన హైకోర్టు
  • వివరణ : ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు

కేసు : ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో అక్రమాల కేసు

  • అంశం : ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
  • స్టేటస్‌ : హైకోర్టులో జరుగుతున్న విచారణ
  • వివరణ : డిసెంబర్‌ 12 (ఈరోజు) విచారణ

 
కేసు : మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు

  • అంశం : ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
  • స్టేటస్‌ : హైకోర్టులో జరిగిన విచారణ
  • వివరణ : తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు, తీర్పు రిజర్వ్

2:30 PM, Dec 12, 2023
ఫైబర్‌ గ్రిడ్‌ కేసు @ సుప్రీంకోర్టు

  • ఫైబర్ నెట్ కేసు పిటిషన్ పై విచారణ జనవరి 17కు వాయిదా
  • చంద్రబాబు 17A - క్వాష్ పిటిషన్ పై తీర్పు అనంతరమే ఈ కేసు విచారిస్తామన్న సుప్రీంకోర్టు
  • విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం
  • చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జనవరి 17కు వాయిదా
  • కేసుకు సంబంధించిన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలను ఇరుపక్షాలు చేయవద్దని సూచన
  • చంద్రబాబు అలాంటి ప్రకటనలు చేసి ఉంటే ఆ రికార్డులు తమకు సమర్పించాలని CID లాయర్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
  • CID వేర్వేరు ప్రాంతాల్లో ప్రెస్‌మీట్ నిర్వహించిందన్న బాబు లాయర్‌ సిద్ధార్థ లూథ్రా
  • ఇరుపక్షాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు గురించి పబ్లిక్‌గా వ్యాఖ్యలు చేయొద్దన్న సుప్రీంకోర్టు
  • ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బైయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడం తో సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు

1:30 PM, Dec 12, 2023
ఫైబర్‌ గ్రిడ్‌ కేసు @ సుప్రీంకోర్టు

  • ఫైబర్ నెట్  కేసులో నేడు సుప్రీంకోర్టులో విచారణ
  • ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ చంద్రబాబు పిటిషన్‌
  • ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు
  • విచారణ జరపనున్న జస్టిస్‌ అనిరుద్ధ బోస్.. జస్టిస్‌ బేలా త్రివేది ధర్మాసనం
  • కోర్టు నంబర్‌ -6లో.. ఐటమ్ నంబర్ 301గా లిస్ట్ అయిన.. చంద్రబాబు ముందస్తు బెయిల్ కేసు

‘ఫైబర్‌గ్రిడ్‌’ కుంభకోణం దర్యాప్తులో CID కీలక అంశాలు

  • టెరాసాఫ్ట్‌ పేరుతో రూ.284 కోట్లు కొట్టేసిన లోకేశ్‌ సన్నిహితులు
  • కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏపీలో చేపట్టిన ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టు
  • రూ.333 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులను నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్‌ సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌కు అప్పగింత
  • కనుమూరి కోటేశ్వరరావు సహకారాన్ని తీసుకున్న వేమూరి వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్, ఫ్యూచర్‌ స్పేస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీల్లో కనుమూరి కోటేశ్వరరావును భాగస్వామిగా చేరిక
  • వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్‌కుమార్‌ రామ్మూర్తిలతో కలిసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్‌ ఫైబర్‌ సొల్యూషన్స్‌ LLP అనే మ్యాన్‌పవర్‌ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్‌ కంపెనీ సృష్టి
  • ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్‌ కంపెనీ, ఇతర కంపెనీలకు రూ.284 కోట్లు విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం
  • నెటాప్స్‌ పేరుతో డొల్ల కంపెనీ సృష్టించి నిధులు మళ్లించిన వేమూరి హరికృష్ణ
  • నెటాప్స్‌ కంపెనీకి చెల్లించిన రూ.8.35 కోట్లను వేమూరి హరికృష్ణకు చెందిన ఫ్యూచర్‌ స్పేస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు మళ్లించారు.
  • నెటాప్స్‌ కంపెనీ నుంచి రూ.1.49 కోట్లను వేమూరి హరికృష్ణ కుమార్తె వేమూరి అభిజ్ఞ ఖాతాకు మళ్లించారు. విదేశాల్లో ఉన్న ఆమె ఇక్కడ తమ కంపెనీలో పనిచేస్తున్నట్లు చూపించి జీతం కింద నెలకు రూ.1.35 లక్షలు చెల్లింపు
  • వేమూరి హరికృష్ణ భార్య వేమూరి నీలిమ ఫ్లాట్‌ కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్‌గా రూ.39.74 లక్షలు నెటాప్స్‌ కంపెనీ బదిలీ
  • నెటాప్స్‌ కంపెనీ 2017 జూన్‌ నుంచి 2020 జూన్‌ మధ్య ఎలాంటి సేవలు, పరికరాల సరఫరా లేకుండానే వేమూరి హరికృష్ణకు రూ.95.90 లక్షలు బదిలీ
  • నెటాప్స్‌ కంపెనీ 2017 జనవరి నుంచి 2019 మార్చి మధ్యలో సేవలు, పరికరాల సరఫరా లేకుండా స్ఫూర్తి ఇన్నోవేషన్స్‌కు రూ.76 లక్షలు బదిలీ
  • టెరాసాఫ్ట్‌ లావాదేవీలను ఆడిటింగ్‌ చేసిన స్వతంత్ర సంస్థ ఐబీఐ గ్రూప్‌
  • ఇప్పటికే ఈ కేసులో నలుగురు సూత్రధారుల అరెస్టు

12:05 PM, Dec 12, 2023
YSRCP మార్పులపై TDP పిచ్చి వ్యాఖ్యలు.. ఒకసారి వెనక్కి తిరిగి చూడండి బాబు..

  • వైసీపీ అంతర్గత పరిణామాలపై స్పందించిన టీడీపీ
  • బడుగు బలహీన వర్గాలకు సీట్లు మార్చడం ఏంటి?
  • సీట్లు మార్చినా.. YSRCPకి కష్టం : తెలుగుదేశం

2019 ఎన్నికల్లో కుప్పకూలిన టీడీపీ కంచుకోటలు

  • అనేక దశాబ్దాలుగా గెలుస్తూ కంచుకోటలుగా భావించిన నియోజకవర్గాల్లో ఘోరంగా ఓడిన తెలుగు దేశం
  • కేవలం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కేబినెట్‌లోని ముగ్గురు మంత్రులు మినహా మిగతావారంతా పరాజయం
  • పార్టీ ఆవిర్భావం తర్వాత గత 36 ఏళ్లలో జరిగిన 8 ఎన్నికల్లో టీడీపీ ఏడు నుంచి ఆరుసార్లు గెలుపు
  • ఇప్పటివరకు టీడీపీ ఏడుసార్లు గెలిచిన నియోజకవర్గాలు 16, ఆరుసార్లు గెలిచినవి 29 చోట్ల ఓటమి
  • శ్రీకాకుళం జిల్లా పలాసలో (గతంలో సోంపేట) 2009లో తప్ప అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ విజయం, 2019లో గౌతు శిరీష ఓటమి
  • 2004లో తప్ప అన్నిసార్లూ గెలుస్తూ వచ్చిన విజయనగరంలో సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు కుమార్తె అదితి గజపతి రాజు ఓటమి
  • పాయకరావుపేటలో టీడీపీ 8 ఎన్నికల్లో ఒకేసారి ఓడింది. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ నెగ్గింది.  
  • ఏడుసార్లు గెలిచిన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో వంగలపూడి అనిత ఓటమి
  • ఏడుసార్లు గెలిచిన కృష్ణా జిల్లా నందిగామలో సైకిల్‌ గల్లంతు
  • 1989లో తప్ప అన్ని ఎన్నికల్లోనూ గుంటూరు జిల్లా పొన్నూరులో టీడీపీ విజయం సాధించగా... 2019లో ఓటమి
  • అనంతపురం జిల్లా పెనుగొండ, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, కర్నూలు జిల్లా పత్తికొండలో ఇలాంటి దీన పరిస్థితి సైకిల్‌కు

మేం కలిసి పోటీ చేసి ఉంటే.. 2019లో మరోలా ఉండేది : టీడీపీ, జనసేన సమన్వయం

  • 2019లో పవన్‌కళ్యాణ్‌ ఎందుకు ఒంటరిగా పోటీ చేశాడో చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు
  • చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నది పవన్‌ ఎజెండా
  • అయినా పారని ఎత్తుగడ, ఛీ కొట్టి ఇంటికి పరిమితం చేసిన ఓటర్లు
  • ఒకసారి కింద ఇచ్చిన ఎన్నికల సంఘం నివేదికను జాగ్రత్తగా పరిశీలించండి

అసలు జనసేన 2019లో కేవలం 137 సీట్లకే ఎందుకు పరిమితమయింది?

  • తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం వల్ల మిగతా చోట్ల పోటీ చేయలేదు
  • ఎక్కడెక్కడ YSRCP అభ్యర్థి బలంగా ఉన్నాడో.. అక్కడ మాత్రమే జనసేన బరిలోకి దిగింది
  • జనసేన ఉద్దేశ్యం ఒకటే.. YSRCP ఓట్లను పరిమితం చేయడం

11:15 AM, Dec 12, 2023
ఇసుక కేసు @ హైకోర్టు

ఇసుక కుంభకోణం కేసులో చంద్రబాబు పిటిషన్
ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరిన చంద్రబాబు
హైకోర్టులో ఇవ్వాళ మధ్యాహ్నం విచారణ
సీఐడీ నమోదు చేసిన కేసులో చంద్రబాబు పిటిషన్

ఇసుక కేసు పూర్వపరాలేంటీ?

  • చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు యథేచ్చగా భూగర్భ వనరుల దోపిడి
  • చంద్రబాబు ఇంటికి కూతవేటు దూరంలోనే..
  • బాబు ఉచిత ఇసుక విధానం.. పేదల కోసం కాదు.. పెద్దల కోసం
  • 2014లో మహిళా సంఘాల ముసుగులో ఇసుక దోపిడీ
  • పేదలు ఇళ్లు కట్టుకోవడానికి దోహదపడాల్సిన ఉచిత ఇసుక విధానం  స్మగ్లర్ల ముఠా చేతికి
  • భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి పెద్దఎత్తున అక్రమార్జనకు పాల్పడిందన్న లాయర్‌ శ్రావణ్‌కుమార్‌
  • పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కిన నటి బాబు ప్రభుత్వం
  • పూడికతీత, డ్రెడ్జింగ్‌ పేరుతో ఇసుకను పెద్దల ముఠా దోచుకుంటుంటే ప్రేక్షకపాత్ర
  • తీవ్రంగా ఆక్షేపించిన NGT
  • అయినా ఎన్జీటీ ఆదేశాలు బేఖాతరు..
  • ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో మళ్లీ ఎన్జీటీని ఆశ్రయించిన రైతులు
  • ఇసుక అక్రమ తవ్వకాలను నిగ్గుతేల్చేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఎన్జీటీ కమిటీ
  • చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూతవేటు దూరంలో 2019 జనవరి 17–18న కమిటీ పరిశీలన
  • స్మగ్లర్ల ముఠా భారీ యంత్రాలతో యథేచ్ఛగా ఇసుక తవ్వుతుండటాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి.. 2019, జనవరి 21న ఎన్జీటీకి నివేదిక సమర్పణ
  • ఈ నివేదిక ఆధారంగా తక్షణమే ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాలని టీడీపీ సర్కార్‌కు NGT అల్టిమేటం
  • ఇసుక అక్రమ తవ్వకాలతో పర్యావరణాన్ని దెబ్బతీసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.వంద కోట్ల జరిమానా
  •  మొత్తాన్ని ఇసుక స్మగ్లర్ల నుంచే వసూలుచేసి చెల్లించాలని స్పష్టం
  • నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఏప్రిల్‌ 4, 2019లో ఇచ్చిన తీర్పులో ప్రస్తావన

10:05 AM, Dec 12, 2023
17a పిటిషన్‌లో ఊరట కోసం బాబు ఆరాటం

  • త్వరలో స్కిల్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే అవకాశం
  • తాను తప్పు చేయలేదని చెప్పకుండా ముందస్తు అనుమతి చుట్టు బాబు వాదనలు

అసలు స్కిల్‌ స్కాంలో ఏం జరిగింది?

  • టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారమే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణం కేసు
  • డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర ఏజెన్సీల గుర్తింపుతో వెలుగులోకి
  • 2017-2018లో నకిలీ ఇన్‌వాయిస్‌లతో బయటపడ్డ అక్రమం
  • అప్రమత్తం చేసినా.. అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబే కాబట్టి పట్టించుకోని వైనం
  • ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు­నాయుడే ప్రధా­న సూత్రధారి, లబ్ధిదారు అని సీఐడీ అభియోగాలు
  • కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరిన బ్యాంకు స్టేట్‌మెంట్లు, రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడీ
  • ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ.. పలువురి అరెస్ట్‌ కూడా
  • షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు
  • చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ ఇస్తామంటూ ఘరానా మోసం
  • రూ.3,300 కోట్లకు సీమెన్స్ సంస్థ - డిజైన్‌టెక్ సంస్థ‌లు ఒప్పందం
  • ప్రభుత్వం 10 శాతం నిధులు ఇస్తే, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం జరిగిందని మోసం
  • రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లను విడుదల చేసిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం
  • ప్ర‌భుత్వం చెల్లించిన రూ.371 కోట్లలో రూ.240 కోట్ల రూపాయ‌ల‌ను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్‌టెక్ సంస్థ‌కు బ‌ద‌లాయించారని సీఐడీ అభియోగం
  • ఎలైట్‌ కంప్యూటర్స్‌, స్కిల్లర్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌, నాలెడ్జ్‌ పోడియం, ఈటీఏ- గ్రీన్స్‌, కేడన్స్‌ పార్టనర్‌ తదితర షెల్‌ కంపెనీలకు నిధుల మళ్లింపు
  • ఈ కుంభ‌కోణం 2016- 2018 మధ్య జ‌రిగింది. దీనిపై గతంలోనే ఏసీబీకి పలువురు ఫిర్యాదు చేశారు
  • ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు
  • చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్‌ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు
  • సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెఓంబర్‌ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్‌ చేసిన సీఐడీ పోలీసులు
  • కీలక ఆధారాలను సుప్రీంకోర్టుకు సమర్పించిన సీఐడీ

8:30 AM, Dec 12, 2023
ఫైబర్ నెట్ కేసులో నేడు సుప్రీంకోర్టులో విచారణ

  • నేడు సుప్రీంకోర్టులో ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బైయిల్ పిటిషన్‌పై విచారణ
  • ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బైయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరణ
  • దీంతో, సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు 
  • విచారణ జరుపనున్న జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం
  • కోర్ట్ నంబర్‌-6లో ఐటమ్ నంబర్ 301గా లిస్ట్ అయిన చంద్రబాబు ముందస్తు బెయిల్ కేసు

7:30 AM, Dec 12, 2023
నేడు ఐఆర్‌ఆర్‌, ఇసుక కేసులో విచారణ

  • ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు పిటిషన్‌పై నేడు హైకోర్టులో మధ్యాహ్నం విచారణ 
  • ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు 
  • ఉచిత ఇసుక కేసులో చంద్రబాబు పిటిషన్‌పై హైకోర్టులో మధ్యాహ్నం విచారణ
  • ఉచిత ఇసుక పథకంపై సీఐడీ నమోదు చేసిన కేసులో చంద్రబాబు పిటిషన్
     

6:45 AM, Dec 12, 2023
అమరావతి.. అసలు నిజాలు..
తెలుగుదేశం పార్టీ ఏం ప్రచారం చేస్తోందంటే..?

  • అమరావతి ఉద్యమానికి ఈ నెల 17వ తేదీకి నాలుగేళ్లు
  • ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న బైబిల్‌ మిషన్‌ గ్రౌండ్స్‌లో సభ
  • అమరావతి పరిరక్షణ సమితి, అమరావతి రాజధాని ఐకాస ఆధ్వర్యంలో ఏర్పాటు
  • సభకు ప్రత్యేక అతిథులుగా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌

అయ్యా.. అమరావతి పెద్దలు.. కొంచెం మీ అస్థాన విద్వాంసుడు జడ శ్రవణ్‌ చెప్పిన మాటలు జాగ్రత్తగా అలకించండి
అమరావతి గురించి జడ శ్రవణ్‌ స్వయంగా చెప్పిన మాటలు ఇవి

  • తెలుగుదేశం పార్టీని నమ్మి ఎవరూ మోసపోవద్దు.: శ్రవణ్‌
  • అసలు అమరావతి పేరిట రైతులను నట్టేట ముంచింది తెలుగుదేశం పార్టీనే
  • భూములిచ్చిన రైతులను ఘోరంగా మోసం చేసింది తెలుగుదేశం పార్టీనే
  • 28వేల మంది రైతుల నుంచి 33 వేల ఎకరాలు లాగేసుకున్నారు..
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద వర్గాల రైతుల కన్నీళ్లకు కారణమైన దానికి మొదటి ముద్దాయి చంద్రబాబే
  • ఏ మేధావి వచ్చినా నేను  చర్చకు సిద్ధం : జడ శ్రవణ్‌
  • అమరావతిని నాశనం చేసింది తెలుగుదేశమే : జడ శ్రవణ్‌
  • రాజధాని పేరిట అన్ని అరిష్టాలకు, దరిద్రాలకు కారణం చంద్రబాబు, తెలుగుదేశమే
  • లోకేష్‌.. నీకు బుద్దుందా? : జడ శ్రవణ్‌
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు ఓటేసిందని శ్రీదేవిని స్టేజీ ఎక్కించి పక్కన కూర్చోబెట్టుకుంటారా?
  • మిమ్మల్ని నమ్ముకున్న పార్టీ ఇన్‌ఛార్జీని బకరా చేస్తారా?
  • ఇదా తెలుగుదేశం నైజం.?
  • సిగ్గుండాలి.. మీకు.. పైకి మీరు చెప్పేది నిష్పక్షపాత రాజకీయమా?
  • రాజకీయాలు, రాజకీయ ప్రయోజనాల కోసం ఎలాంటి వ్యభిచారమైనా చేస్తారా?
  • తండ్రీ కొడుకులు రాజకీయ వ్యభిచారంలో గిన్నీస్‌ బుక్‌ ఎక్కుతారు..!
  • వ్యభిచార రాజకీయాలు ఎంత దుర్మార్గంగా జరుగుతాయో అన్నదానికి తెలుగుదేశం ప్రత్యక్ష ఉదాహరణ
  • డబ్బుతోనే మీ రాజకీయం నడుపుదామనుకుంటే.. మీరసలు నాయకులే కాదు
  • రాజకీయం అంటే విలువలు, విశ్వసనీయత ఉండాలి
  • మీకు అసలు మీ పార్టీ క్యాడర్‌ ఎవరో తెలుసా? కార్యకర్తలెవరో తెలుసా?.

6:35 AM, Dec 12, 2023
చంద్రబాబుకు కొడాలి నాని కౌంటర్‌

  • నందమూరి వంశస్తులను రాజకీయాల్లో చంద్రబాబు ఎదగనివ్వడు. 
  • లోకేష్‌ కోసమే చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు
  • దేవుడి దయ వల్లే జూనియర్‌ ఎన్టీఆర్‌ కారు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. 

భువనేశ్వరీ యాత్రకు మంగళమేనా?

  • హంగు, ఆర్భాటాలతో మూడు పర్యటనలు చేసిన భువనేశ్వరీ
  • ‘నిజం గెలవాలి’ పేరుతో భువనేశ్వరీ యాత్రలు
  • అక్టోబర్‌ 25న పర్యటనలు ప్రారంభించిన భువనేశ్వరీ
  • నారావారిపల్లె నుంచి బస్సు యాత్ర
  • చంద్రబాబు అరెస్ట్‌ తట్టుకోలేక 150 మంది చనిపోయారని తెలుగుదేశం, ఎల్లో మీడియా ప్రచారం
  • వారానికి మూడు రోజుల పాటు ఒక్కో ఇంటింటికి వెళ్లి పరామర్శిస్తానన్న భువనేశ్వరీ
  • మూడు కుటుంబాలను కలిసిన నారా భువనేశ్వరీ
  • ఒక్కో కుటుంబానికి పాత డేట్‌తో ఉన్న రూ.3 లక్షల చెక్కు పంపిణీ
  • ఈ లోగా చంద్రబాబుకు ఆరోగ్య కారణాలతో బెయిల్‌ మంజూరు
  • ఎందుకు ఖర్చు అనుకున్నారో.. లేక అనవసర శ్రమ అనుకున్నారో?. మొత్తానికి అటకెక్కిన పరామర్శ యాత్ర
  • అసలు కారణం నిజం చెప్పాల్సి వస్తుందంటున్న విశ్లేషకులు

అసలు భువనేశ్వరీ ఈ నిజాలు చెప్పగలరా?

  • నా ఆస్థి లక్ష కోట్లు అని బాబు చెప్పిన వీడియోలు ఉన్నాయి, ఆ ఆస్తిని పాలు,  పెరుగు అమ్మి సంపాదించాడా?
  • బాబు అవినీతికి నేను అడ్డు అని నాకు వెన్నుపోటు పొడిచాడు బాబు అని ఎన్టీఆర్ చెప్పింది నిజమా? కాదా?
  • మహానాడు హుండీ డబ్బులు కాజేసేవాడు బాబు అని  దగ్గుపాటి  పుస్తకం రాసింది నిజమా? కాదా?
  • గొర్రెలు తినే కాంగ్రెస్ పోయి బర్రెలు తినే బాబు వచ్చాడు అని హరికృష్ణ అన్నది  నిజమా? కాదా?
  • బాబు జమానా అవినీతి ఖజానా అని కమ్యూనిస్టులు పుస్తకం రాసింది నిజమా? కాదా?
  • బాబు పాలనలో అంతా అవినీతి అని , బీహార్ నయం అని జపాన్ మాకీ సంస్థ యజమాని పూమిహికో లేఖ రాసి వెళ్ళిపోయింది నిజమా? కాదా?
  • అమరావతి కాంట్రాక్టర్ ల నుంచి 600 కోట్ల సచివాలయం బిల్డింగ్ లో 119 కోట్లు (20 శాతం ) ముడుపులు  బాబు  పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని  అమరావతి కాంట్రాక్టర్ అయిన  షాపుర్జీ పల్లంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు. అవును నిజమే ఆ డబ్బు బాబుకు ఇచ్చాను అని  బాబు పర్సనల్ సెక్రటరీ ఒప్పుకున్నాడు అని ఆగష్టు 4 న  కేంద్ర సంస్థ  ఇన్‌కమ్ టాక్స్ బాబుకు నోటీస్ ఇచ్చింది. నిజమా? కాదా?
  • 371 కోట్ల స్కిల్ కుంభకోణంలో  మాకు ఎటువంటి సంబంధం లేదు అని సీమెన్స్  చెప్పింది అంటే టెండర్ లేకుండా సిమ్సన్  పేరుతో రూ.371 కోట్లు పక్కదారి పట్టించారు. ఈ స్కిల్ కుంభకోణం లో కేంద్ర సంస్థ ED నలుగురిని అరెస్ట్ చేసింది. ఇది నిజమా? కాదా?
  • ఓటుకు కోట్లు అంటూ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బ్రోకర్లతో మనవాళ్లు బ్రీఫ్‌డ్‌మీ అన్నది చంద్రబాబు.. నిజమా? కాదా?
  • బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపినపుడు(ఫిబ్రవరి 13 ,2020) 2 వేల కోట్ల అక్రమలావాదేవీలకు సంబందించి నల్లధన వివరాలు లభ్యమయ్యాయని ఫిబ్రవరి 17,2020 న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల చేశారు. నిజమా? కాదా?

ఈ నెల 20న యువగళానికి మంగళం

  • ఈనెల 20న లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ
  • విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్టు సమీపంలోని సభ
  • పోలేపల్లి వేదికగా 20వ తేదీన లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు ఏర్పాట్లు
  • ముగింపు సభకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ
  • ఎలాగైనా భారీగా జన సమీకరణ చేసి పాదయాత్రకు ముగింపు పలకాలని టిడిపి ప్రయత్నాలు
  • సభ విజయవంతం కోసం సీనియర్ నేతలతో 14 కమిటీల ఏర్పాటు
  • చివరి 200 కిలోమీటర్ల దాటవేతపై కిక్కురమనని టిడిపి నేతలు
  • నేను నడవలేను, నాపై ఒత్తిడి తేవొద్దని ఇప్పటికే లోకేష్‌ సంకేతాలు
  • ఏదో ఒకటి, ఇక్కడితో సమాప్తం చేద్దామన్న యోచనలో పార్టీ

విశాఖలో ఏం జరుగుతోంది?

  • విశాఖ : ఎంపీ ఎంవివిపై జనసేన తప్పుడు ప్రచారం
  • టైకున్ హోటల్ వద్ద వాస్తు పేరుతో ఎంవివి కోసం రహదారి ముసేసారు అంటూ అసత్య ప్రచారం
  • ధర్నాల పేరుతో జనసేన నేతల డ్రామా..
  • ప్రచారం కోసం చీప్ పాలిటిక్స్ కు పాల్పడుతున్న జనసేన
  • గతంలోనే రహదారిని తెరిపించాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేసిన ఎంవీవీ
  • జీవీఎంసీ అధికారులకు సీపీకి గతంలోనే లేఖ రాసిన ఎంవివి
  • ప్రచారం కోసం ధర్నాలు చేయడమేంటీ?
  • పైగా నేను వచ్చి పోరాడుతానని చెప్పుకోవడమేంటీ?


అధిష్టానానికి తమ్ముళ్ల అల్టిమేటం

పశ్చిమ నియోజకవర్గం టీడీపీలో ముదురుతున్న టిక్కెట్ పంచాయతీ

  • విజయవాడ పశ్చిమ టిక్కెట్ తమలో ఒకరికి ఇవ్వాలంటున్న బుద్దా వెంకన్న ,నాగుల్ మీరా
  • జలీల్ ఖాన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బుద్ధావెంకన్న , నాగుల్ మీరా

బుద్ధా వెంకన్న

  • విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీని నడిపించింది, నడిపించేది నేను, నాగుల్ మీరా మాత్రమే
  • ఇప్పుడు ఎవరెవరో వచ్చి మాకు ఎమ్మెల్యే సీటు అని ప్రచారం చేసుకుంటున్నారు
  • ఎవరికి వారు చెప్పుకుంటే కాదు.. చంద్రబాబే ఎమ్మెల్యే అభ్యర్ధులను ఖరారు చేస్తారు
  • మా అభిప్రాయాలను చంద్రబాబు ముందు పెడతాం
  • అధినేతగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా.. మేము గౌరవిస్తాం.. కానీ మాకే అవకాశం ఇస్తారని నమ్ముతున్నాం
  • నాయకులు కూడా ఎవరైతే పార్టీ కోసం పని చేస్తారో, విధేయులుగా ఉండారో ఆలోచన చేసి టిక్కెట్లు ఇస్తారు
  • బీసీ అయితే నాకు, ముస్లీం అయితే నాగుల్ మీరాకు మాత్రమే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఇవ్వాలి

నాగుల్ మీరా

  • విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ సీటును కొందరు ఆశిస్తున్నారు
  • పార్టీలోకి కొన్ని నెలల ముందు వచ్చి హడావుడి చేస్తే.. సీటు ఇచ్చేస్తారని భావిస్తున్నారు
  • ఈ నియోజకవర్గంలో 25 ఏళ్లుగా బుద్దా వెంకన్న, నేను టీడీపీ కోసం పని చేస్తున్నాం
  •  బీసీ అయితే బుద్దా వెంకన్న, మైనారిటీ కోటా అయితే నాకు సీటు ఇస్తారు
  • బుద్దా వెంకన్న సీటు అడగటంలో చాలా న్యాయం ఉంది
  • ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించి చంద్రబాబు సీటు ఇస్తారని భావిస్తున్నా
  • వెంకన్నకు ఇవ్వలేని పక్షంలో మైనారిటీ కోటాలో సీటు ఇవ్వాలనే హక్కు నాకు మాత్రమే ఉంది
  • పార్టీ మీద ఉన్న కమిట్ మెంట్ తోనే మేము సీటు అడుగుతున్నాం
  • ఇప్పుడు ఎవరెవరో వచ్చి సీటు అడిగితే ... మేము చూస్తూ ఉండం
  • మాకు అవకాశం ఇస్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పసుపు జెండా ఎగుర వేస్తాం..
>
మరిన్ని వార్తలు