Google Search: టాప్‌ సెర్చ్‌ ఐటెమ్స్‌ ఇవే!

12 Dec, 2023 07:10 IST|Sakshi

2023 ముగియడానికి.. 2024 ప్రారంభం కావడానికి మరెన్నో రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది భారతదేశంలో ఎక్కువ మంది గూగుల్‌లో ఏమి సెర్చ్ చేశారు, నెటిజన్ల దృష్టిని ఆకర్శించిన అంశాలు ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇయర్ ఇన్ సెర్చ్ 2023 ప్రకారం.. ఈ సంవత్సరం ఎక్కువమందిని ఆకర్శించిన అంశం చంద్రయాన్ 3. ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్న సంఘటనల్లో చంద్రయాన్-3 సక్సెస్ ఒకటి. ఆ తరువాత కర్ణాటక ఎన్నికలకు సంబంధించిన అంశాలను కూడా ఎక్కువగా గూగుల్ సర్చ్ చేసినట్లు తెలుస్తోంది.

ఇజ్రాయెల్ హమాస్ యుద్దానికి సంబంధించిన విషయాలు, బడ్జెట్ 2023, టర్కీ భూకంపం, ఒడిశా రైలు ప్రమాదానికి సంబంధించిన వార్తలను ఎక్కువమంది గూగుల్ సెర్చ్ చేసినట్లు ఇటీవల విదులైన కొన్ని నివేదికల ద్వారా తెలిసింది.

2023లో ఎక్కువమంది గూగుల్ సెర్చ్ చేసిన విషయాలు

  • చంద్రయాన్-3
  • కర్ణాటక ఎన్నికల ఫలితాలు
  • ఇజ్రాయెల్ వార్తలు
  • సతీష్ కౌశిక్
  • బడ్జెట్ 2023
  • టర్కీ భూకంపం
  • అతిక్ అహ్మద్
  • మాథ్యూ పెర్రీ
  • మణిపూర్ వార్తలు
  • ఒడిశా రైలు ప్రమాదం

ఇదీ చదవండి: ఆస్ట్రేలియాలో ఇండియన్ బ్రాండ్ డీలర్షిప్ ఎలా ఉందో చూసారా.. (వీడియో)

పైన తెలిపిన విషయాలు మాత్రమే కాకుండా చాట్‌జీపీటీ, ఇన్‌స్టాగ్రామ్, యూనిఫాం సివిల్ కోడ్ సంబంధిత చాలా విషయాలను కూడా గూగుల్ సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో.. జీ20 అంటే ఏమిటి,యూసీసీ అంటే ఏమిటి, చాట్‌జీపీటీ అంటే ఏమిటి, హమాస్ అంటే ఏమిటి, 2023 సెప్టెంబర్ 28 ప్రత్యేకత, ఇన్‌స్టాగ్రామ్‌ థ్రెడ్‌ అంటే ఏమిటి, సెంగోల్ అంటే ఏమిటి అనే అంశాలు ఉన్నాయి.

>
మరిన్ని వార్తలు