తవ్వే కొద్దీ పల్లాలే

23 Apr, 2021 11:01 IST|Sakshi

 వెలుగుచూస్తున్న గాజువాక మాజీ ఎమ్మెల్యే  పల్లా శ్రీనివాస్‌ భూ అక్రమాలు

రూ.కోట్ల విలువైన భూములు మింగేసి.. రికార్డులు మార్చేసి.. 

అధికారుల పరిశీలనలో ఒక్కొక్కటిగా బయటపడతున్న నాటి భూ బాగోతాలు 

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : అధికారం అడ్డుపెట్టుకుని నాడు తెలుగుదేశం హయాంలో అడ్డగోలుగా కాజేసిన పల్లా అండ్‌ కో భూ దందాల లెక్కలన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఆ కబ్జాల్లో చెరువులు, గయాళు వంటి ప్రభుత్వ భూములు సైతం ఇరుక్కొన్నాయి. చేతికి మట్టి అంటకుండా అందిన కాడికి భూములను మింగేసిన పల్లా అండ్‌ కో బాగోతంపై ఎట్టకేలకు అధికారులు దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. 

టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు భూబాగోతంపై గురువారం ‘సాక్షి’లో ‘పల్లా భూదాహం’ శీర్షికన కథనం వెలువడిన సంగతి తెలిసిందే. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగిన గాజువాక రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితి చూసి విస్తుబోయారు. శుక్రవారం మరోసారి గ్రౌండ్‌ సర్వే చేయాలని నిర్ణయించారు. 

తుంగ్లాం సర్వే నంబర్‌ 30/12లో 1 ఎకరా 10 సెంట్ల ప్రభుత్వ భూమి, సర్వే నంబర్‌ 30/13లో 27 సెంట్ల ప్రభుత్వ భూమి, సర్వే నంబర్‌ 30/15లో 68 సెంట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్టు తెలుస్తోంది. దీనిపై అధికారులు సర్వే చేయాలని నిర్ణయించారు. 

తుంగ్లాం సర్వే నంబర్‌ 34/2లోని 1 ఎకరా 34 సెంట్లు, సర్వే నంబర్‌ 34/4లోని 13 సెంట్లు, సర్వే నంబర్‌ 34/2లోని 24 సెంట్ల రస్తా భూమి కబ్జాల్లో కలిసిపోయినట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీనిపై కూడా సర్వే నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. 

రూ.20 కోట్ల విలువైన భూమిని మింగేసి...
గాజువాక పట్టణానికి నడిబొడ్డున ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బంధువులు ఆక్రమించారు. అప్పట్లో అధికారాన్ని అడ్డుపెట్టుకొని గాజువాక సర్వే నంబర్‌ 87లో ఉన్న వెయ్యి గజాల స్థలంలో తాత్కాలిక దుకాణాలను నిర్మించి అద్దెలకు ఇచ్చారు. హౌస్‌ కమిటీ పరిధిలోని కొత్తగాజువాక జంక్షన్‌లో మెయిన్‌ రోడ్డుకు, హైస్కూల్‌ రోడ్డుకు కార్నర్‌లో ఉన్న ఈ భూమి ధర అక్షరాలా రూ.20కోట్లు. ప్రస్తుతం ఇక్కడ బహిరంగ మార్కెట్‌ విలువ ప్రకారం చదరపు గజం ధర రూ.2 లక్షలు పలుకుతోంది. 20 ఏళ్ల క్రితమే ఈ స్థలంపై కన్నేసిన పల్లా కుటుంబం ఏడేళ్ల కితం టీడీపీ అధికారం చేతిలోకి రాగానే దాన్ని ఆక్రమించి జీవో 301 ప్రకారం క్రమబదీ్ధకరణ కూడా చేసేసుకున్నారు. 

గాజువాక సర్వే నంబర్‌ 5/1 లో 714 చదరపు గజాల హౌస్‌ కమిటీ స్థలానికి తన పేరున, తన సోదరుడి పేరున క్రమబదీ్ధకరణ పట్టాలను పొందడం వివాదాస్పదమైంది. దీనిపై జెన్యూనిటీ సరి్ట ఫికెట్‌ మంజూరు చేయడానికి సైతం గాజువాక తహసీల్దార్‌ నిరాకరించారు. దరఖాస్తుదారుల సంతకాలు లేకుండానే ఈ పట్టాలను పొందినట్టు సమాచార హక్కు చట్టం ద్వారా అధికారులు వెల్లడించినట్టు తెలిసింది. దీనిపై కూడా ప్రస్తుతం విచారణ చేపట్టినట్టు సమాచారం. 

రికార్డులు మార్చేసి... 
దువ్వాడలో మూడున్నర కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమికి పల్లా బినామీలు రికార్డులు మార్చేసి కబ్జా చేశారు. ఆ భూమి తనదంటూ కోర్టుకెక్కిన ఒక వ్యక్తి నుంచి గతంలో భూమిని కాపాడుకున్న రెవెన్యూ అధికారులే టీడీపీ హయాంలో పల్లా బినామీలకు అప్పనంగా అప్పగించారు. కూర్మన్నపాలెం సర్వే నంబర్‌ 8/6లో 1.35 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమి తనదంటూ గతంలో ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. తనకు అసైన్‌మెంట్‌ పట్టా ఉందని వాదించాడు. దీనిపై స్పందించిన రెవెన్యూ అధికారులు ఆ పట్టాను రద్దు చేశామని కోర్టుకు వివరిస్తూ అది ప్రభుత్వ భూమేనని స్పష్టం చేశారు.

దీంతో ఆ భూమిని స్వాదీనం చేసుకోవాల్సిందిగా రెవెన్యూ అధికారులకు హైకోర్టు సూచించింది. అప్పట్నుంచీ అధికారులు తమ పర్యవేక్షణతో దాన్ని కాపాడుతూ వచ్చారు. ఈ క్రమంలో 1.35 ఎకరాల ప్రభుత్వ భూమిలో 42 సెంట్ల భూమిని కోర్టుకెక్కిన వ్యక్తి పేరుమీద మార్చేసి సర్వే నంబర్‌ 8/6బి పేరుతో ఆన్‌లైన్‌లో కూడా పెట్టేశారు. దీంతో సదరు వ్యక్తి తమకు అమ్ముతున్నట్టు స్థానిక పల్లా సన్నిహిత అనుచరుడి పేరుమీద సేల్‌ అగ్రిమెంట్‌ను కూడా రాయించుకున్నారు. ఇక రిజి్రస్టేషనే తరువాయి అనుకున్న సమయంలో స్థానిక సొసైటీ ప్రతినిధులు అడ్డు తగలడంతో ఆగిపోయింది. అయినప్పటికీ అధికార బలాన్ని ఉపయోగించిన  పల్లా ఆ స్థలాన్ని తన ఆ«దీనంలోకి తీసుకున్నారు. 

కదిలిన రెవెన్యూ యంత్రాంగం 
అక్కిరెడ్డిపాలెం(గాజువాక): మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ‘భూదాహం’పై గాజువాక రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. తహసీల్దార్‌ లోకేశ్వరరావు, ఆర్‌ఐ మంగరాజు, సర్వేయర్‌ ఎం.వెంకన్న గురువారం జగ్గరాజుపేట రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్లు 12, 14, 28తో పాటు 32, 36లో అక్రమణలకు సంబంధించి వివరాలు సేకరించారు. సర్వే నంబర్‌ 12లో ఎల్‌అండ్‌టీ సంస్థ కాంట్రాక్ట్‌ పనులు చేపడుతున్న ప్రాంతంలో పరిస్థితిని పరిశీలించారు. ‘‘సర్వే నంబర్లు 12, 14, 28కు సంబంధించి రికార్డులను బయటకు తీస్తాం.. ఆక్రమణలు జరిగినట్లు రుజువైతే.. శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని తహసీల్దార్‌ లోకేశ్వరరావు తెలిపారు.  

మరిన్ని వార్తలు