అయినా ఇప్పుడు ట్రిప్పులు ఏంటి : శృతి హాసన్‌ ‌

23 Apr, 2021 11:00 IST|Sakshi

దేశ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తున్నా సెలబ్రిటీలు మాత్రం వినోదాల కోసం విదేశాలకు వాలిపోతున్నారు. ప్రజలంతా ఇంటికే పరిమితం కావాలని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని ప్రభుత్వాలు నెత్తీ నోరు ముత్తుకుంటున్నా కొందరు బాలీవుడ్‌ సెలబ్రిటీలకు మాత్రం అది చెవికెక్కడం లేదు. ఇటీవలె బాలీవుడ్‌ ప్రేమ పక్షులు అలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌, దిషా పటాని-టైగర్‌ ష్రాఫ్ హాలీడే ఎంజాయ్‌ చేయడం కోసం మాల్దీవులు చెక్కేసిన సంగతి తెలిసిందే. వీరి హాలిడే  ట్రిప్‌పై నెటిజనులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.  ‘‘కాస్త అయిన బాధ్యత ఉండక్కర్లేదా.. ఓ వైపు దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మీకు టూర్లు కావాల్సి వచ్చిందా’’అంటూ ట్రోల్స్‌ చేస్తున్నారు.

తాజాగా ఇదే అంశంపై హీరోయిన్‌ శృతి హాసన్‌ సైతం స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'వారికి హాలిడే దొరికినందుకు సంతోషం, వారు దానికి అర్హులు కూడా. అయితే విహారయాత్రలకు ఇది సరైన సమయం కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రస్తుతం ఎంతోమంది కష్టకాలంలో ఉన్నారు. ఇలాంటి పాండమిక్‌ సమయంలో వెకేషన్‌ ట్రిప్పులకు వెళ్లడం కరెక్ట్‌ కాదు' అని పేర్కొంది. శృతి సహాన్‌ పాటు రోహిణి అయ్యర్, కాలమిస్ట్ శోభా దే సహా పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు సెలబ్రిటీల విహారయాత్రలను తప్పుబడుతున్నారు. 

చదవండి: ‘‘ఓ పక్క జనాలు చస్తుంటే.. మీరు ట్రిప్పులకు వెళ్తారా?’’
గుండె పగిలింది: విషాదంలో పూజా హెగ్డే 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు