కోడెల శివరామ్‌పై టీడీపీ నేత ఫిర్యాదు

8 Feb, 2021 09:02 IST|Sakshi

సాక్షి, సత్తెనపల్లి: శాసన సభ మాజీ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్‌ తన వద్ద నుంచి రూ.1.30 కోట్ల విలువైన లిక్కర్‌ తీసుకుని డబ్బులివ్వడం లేదని గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణ పోలీసులకు ఆదివారం టీడీపీ నేత నర్రా రమేష్‌ ఫిర్యాదు చేశాడు. రాజుపాలెం మండలం గణపవరం గ్రామానికి చెందిన నర్రా రమేష్‌ టీడీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్‌ వ్యాపారం చేశారు. గత సార్వత్రిక ఎన్నికలకు తన తండ్రి శివప్రసాదరావు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో మద్యం పంపిణీ చేసేందుకు రూ.1.30 కోట్ల లిక్కర్‌ను తీసుకుని నగదు చెల్లించలేదని, డబ్బులు అడిగితే చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని, తమకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2015 నుంచి 2019 వరకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని మద్యం వ్యాపారుల నుంచి అనధికారికంగా నగదు వసూలు చేశాడని ఆరోపించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు