టాప్‌ న్యూస్‌.. నేటి విశేషాలు

16 Jan, 2021 18:08 IST|Sakshi

టీకా ప్రక్రియను ప్రారంభించిన సీఎం జగన్‌
సర్వజనాసుపత్రి (జీజీహెచ్‌)లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టీకా కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ముందుగా ఆయన వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. హెల్త్ వర్కర్‌ పుష్పకుమారికి తొలి టీకాను వైద్యులు వేశారు. అనంతరం హెల్త్ వర్కర్లు నాగజ్యోతి, జయకుమార్‌, స్టాఫ్ నర్సు మరియమ్మ, డా.ప్రణీతలకు వ్యాక్సిన్ ఇచ్చారు. పూర్తి వివరాలు..

కరోనా వ్యాక్సిన్‌.. వెనక్కితగ్గిన ఈటల
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ ఊపందుకున్న తరుణంలో భారత్‌లోనూ పంపిణీ షూరు అయ్యింది. కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌ విధానంలో శనివారం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి 3,006 కేంద్రాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ మొదలైంది. తొలి టీకాను ఢిల్లీ ఎయిమ్స్‌లోని శానిటైజర్‌ కార్మికుడు మనీష్‌ కుమార్‌కు వేయగా.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోనూ టీకా ప్రక్రియ ఆరంభమైంది. పూర్తి వివరాలు..

కావాలనుకుంటే లోకేష్ మీద కేసు పెట్టలేమా?
 దేవాలయాలపై, విగ్రహాలపై జరుగుతున్న దాడులపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌‌ స్పష్టంగా వివరణ ఇచ్చారని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. ఇందులో టీడీపీ హస్తం ఉందనే నిజం ఎక్కడ బయటపడుతుందో అనే భయం వారిలో కనిపించిందన్నారు. ఒక్కసారిగా అందరూ బెంబేలెత్తారని, గుంపులు, గుంపులుగా ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాలు..

భారత్‌లో మొదటి ఎయిర్‌ ట్యాక్సీ సర్వీసు
దేశంలోనే మొట్టమొదటి ఎయిర్‌ ట్యాక్సీ సర్వీసు చండీగఢ్‌లో ప్రారంభమయ్యింది. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ చండీగఢ్‌ విమానాశ్రయంలో ఈ సర్వీసును ప్రారంభించారు. ఉడాన్‌ పథకంలో భాగంగా ప్రభుత్వం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ట్యాక్సీ చండీగఢ్‌ నుంచి హిసార్‌ వరకు ప్రయాణికులను చేరవేయనుంది. పూర్తి వివరాలు..

నార్వేలో టీకా విషాదం.. 23 మంది మృతి
నార్వేలో విషాదం చోటు చేసుకుంది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో 23 మంది వృద్ధులు మరణించారు. దాంతో నార్వే ప్రభుత్వం బాగా ముసలివారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు వ్యాక్సిన్‌ తీసుకోవద్దని సూచించింది. వివరాలు.. ఫైజర్‌ ఎన్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఫస్ట్‌ డోసు తీసుకున్న వారిలో 23 మంది వృద్ధులు మరణించారు. పూర్తి వివరాలు..

యూట్యూబ్‌ వీడియోల స్పూర్తితో..​​​​​​​
యూట్యూబ్‌ వీడియోల స్పూర్తితో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌ రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. శనివారం ముఠాలోని ఆరుగురు సభ్యులను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో  హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్‌ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. పూర్తి వివరాలు..

ఇక ఎక్కువ సమయం తనతోనే గడిపేస్తా : పూజా హెగ్డే​​​​​​​
ఈ ఏడాది ఎక్కువ సమయం బ్రూనోకే కేటాయిస్తా అని చెబుతోంది  పూజాహెగ్డే.  బ్రూనో అంటే ఎవరుకాదు.. తాను పెంచుకునే కుక్కపిల్ల.‘ ప్రతి ఏడాది ఒక్కొక్కరు ఒక్కో కొత్త నిర్ణయం తీసుకుంటారు. నేను కూడా ఈ ఏడాది ఎక్కువ సమయం బ్రూనోతోనే గడపాలని డిసైడ్ అయ్యానని ఈ బ్యూటీ చెబుతోంది. పూర్తి వివరాలు..

ఏమాత్రం బాధ్యత లేని రోహిత్‌!
నిర్ణయాత్మక నాలుగో టెస్టులో భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 62 పరుగులకు ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌ వికెట్లను కోల్పోయింది. రోహిత్‌ శర్మ 74 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. కమిన్స్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌ రెండో బంతికి గిల్‌ ఔట్‌ కాగా, లయన్‌ వేసిన 20 ఓవర్‌ ఐదో బంతికి రోహిత్‌ పెవిలియన్‌ చేరాడు. పూర్తి వివరాలు..

వాట్సాప్‌ అప్‌డేట్‌‌.. మరో 3 నెలలు వాయిదా​​​​​​​
నూతన ప్రైవసీ విధానంపై వాట్సాప్‌ వెనక్కి తగ్గింది. మరో మూడు నెలల పాటు అప్‌డేట్‌ని వాయిదా వేయనున్నట్లు ప్రకటించింది. పది రోజుల క్రితం వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటిని అంగీకరించకపోతే యూజర్‌ మొబైల్‌ ఫోన్లలో 2021, ఫిబ్రవరి 8 నుంచి వాట్సాప్‌ పని చేయదని ప్రకటించింది. పూర్తి వివరాలు..

​​​​​​​

కరోనా వ్యాక్సినేషన్‌ తొలి టీకా.. వీడియో
 దేశ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. శనివారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి 3,006 కేంద్రాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ మొదలైంది. దేశంలో తొలి కరోనా టీకాను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో శానిటైజర్‌ వర్కర్‌ మనీష్‌ కుమార్‌కు వైద్యులు వేశారు. పూర్తి వివరాలు..

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు