ఆకలితో వెళ్లి.. మృత్యువుతో తల్లడిల్లి.. ఈ పాపం ఎవరిదీ?

5 May, 2021 11:07 IST|Sakshi
విద్యుత్‌షాక్‌లో మృతి చెంది దిమ్మె మద్యలో ఇరుక్కపోయిన ఆవు 

విద్యుదాఘాతంతో రెండు ఆవులు మృతి

సాక్షి, కడప:  ఆకలి మాటున మృత్యువు పొంచి ఉందని తెలియని ఆవులు తనువులు చాలించాయి. ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై తల్లడిల్లుతూ ప్రాణాలు వదిలాయి. కడప వైవీ స్ట్రీట్‌ రెండో గాంధీ విగ్రహంవద్ద డీసీసీ బ్యాంకు బ్రాంచ్‌ కార్యాలయం పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను తగిలి రెండు ఆవులు మృతి చెందాయి. బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పాపం ఎవరిదీ? అని అక్కడ జరిగిన సంఘటనను చూసిన ప్రతి ఒక్కరూ ప్రశ్నించారు.

విద్యుత్‌షాక్‌తో కాలిపోయిన మరో ఆవు 

నగరంలో ప్రధాన కూడలిలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు కంచె లేదా రక్షణ గోడ ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని వాపోయారు. ట్రాన్స్‌ఫార్మర్‌కు పక్కనే చెత్త డంపును ఏర్పాటు చేయడంతో ఆవులు ఆకలితో ఏదైనా తినేందుకు వెళ్లి విద్యుత్‌ షాక్‌తో మృతిచెంది ఉంటాయని చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్‌కు రక్షణ గోడ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.  

చదవండి: నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోన్న అరుదైన జాతి దూడ

మరిన్ని వార్తలు