వ్యాక్సినేషన్‌లో ఏపీ ముందంజ

19 Jan, 2021 12:05 IST|Sakshi

విజయవాడ: కరోనా విరుగుడుగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్‌లో ముమ్మరంగా సాగుతోంది. మంగళవారం నాలుగో రోజు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 332 కేంద్రాలలో కోవిడ్‌ టీకా వేస్తున్నారు. వ్యాక్సినేషన్‌లో భాగంగా మూడో రోజు కోవిడ్ టీకా వేసుకున్న వారి సంఖ్య 14,606. మూడు రోజులలో  వ్యాక్సినేషన్ వేయించుకున్న వారి మొత్తం సంఖ్య 46,755. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్‌ ముందుస్థానంలో ఉంది. వారంలో నాలుగు రోజుల పాటు వ్యాక్సినేషన్‌ వేస్తున్నారు.

వ్యాక్సినేషన్‌ విజయవంతంగా కొనసాగుతోంది. ముందుగా కరోనా వారియర్స్‌గా ఉన్న వైద్యులు, వైద్య సిబ్బందితో పాటు పారిశుద్ధ్య కార్మికులకు టీకాలు వేస్తున్న విషయం తెలిసిందే. టీకాల పంపిణీని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి వేగవంతమయ్యేలా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ పర్యవేక్షిస్తున్నారు.

మూడో రోజు జిల్లాల వారీగా వ్యాక్సిన్ వేసుకున్న వారి సంఖ్య

 • అనంతపురము 1,276
 • చిత్తూరు           976
 • తూర్పుగోదావరి 1,923
 • గుంటూరు        1,490
 • కృష్ణా               473
 • కర్నూలు         860
 • ప్రకాశం            1,017
 • నెల్లూరు           1,847
 • శ్రీకాకుళం         1,193
 • విశాఖపట్నం    1,474
 • విజయనగరం    781
 • పశ్చిమగోదావరి 459
 • వైఎస్సార్ కడప  837
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు