ఏపీలో సచివాలయ వ్యవస్థ అద్భుతం

1 Aug, 2021 04:38 IST|Sakshi
సాయినగర్‌ సచివాలయంలో తేని.విజయకుమార్, సర్పంచ్‌ డీవీ రమణ

పుదుచ్చేరి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తేని.విజయకుమార్‌ ప్రశంస

తిరుపతి రూరల్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతమని పుదుచ్చేరి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తేని.విజయకుమార్‌ కొనియాడారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని సాయినగర్‌ గ్రామ సచివాలయాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. సర్పంచ్‌ డీవీ రమణ, సచివాలయ సిబ్బందితో మాట్లాడారు. తక్కువ సమయంలో పారదర్శకంగా ప్రజలకు సేవలందించడంలో సచివాలయ వ్యవస్థ సంజీవనిలా పనిచేస్తుందని అక్కడి సిబ్బందిని ప్రశంసించారు.

చెవిరెడ్డి సేవలు ఆదర్శం
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సొంత నిధులతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సేవలు ప్రజాప్రతినిధులకు ఆదర్శమని మంత్రి విజయకుమార్‌ కొనియాడారు. ఫోన్‌లో చెవిరెడ్డిని అభినందించారు.   

మరిన్ని వార్తలు