4న మహిళా పార్లమెంట్‌

27 Feb, 2022 04:37 IST|Sakshi
సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న రాష్ట్ర మహిళా కమిషన్‌ ౖచైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ

సాక్షి, అమరావతి: మహిళల అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు మార్చి 4న మహిళా పార్లమెంట్‌ నిర్వహించబోతున్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, క్రీడలు, మీడియా, సినిమా, కళలు తదితర రంగాలకు చెందిన మహిళలు పాల్గొంటారని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తెలిపారు.

రాష్ట్ర మహిళా కమిషన్‌ నేతృత్వంలో జాతీయ మహిళా కమిషన్‌ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం జరుగుతున్నట్లు చెప్పారు. శనివారం కమిషన్‌ సభ్యులు, అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించి.. ఏర్పాట్లపై చర్చించారు. ఎన్జీవోలను కూడా భాగస్వాముల్ని చేయాలని సూచించారు. ఆర్థిక పురోగతి, రక్షణ, ఆరోగ్యం తదితర అంశాలపై నివేదిక రూపొందించి ప్రభుత్వాలకు సమర్పిస్తామని చెప్పారు.   

మరిన్ని వార్తలు