YS Jagan: అత్యధిక పరీక్షలు, ఉచిత వైద్యం.. ప్రజలకు అండగా..

6 May, 2021 11:52 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలోనే అత్యధిక కరోనా వైరస్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించి కరోనా కట్టడికై విశేష కృషి చేస్తోంది. పలు రాష్ట్రాల్లో కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న వేళ.. రాష్ట్రంలో కరోనా బాధితులకు ఉచిత వైద్యం అందిస్తూ ముందంజలో నిలుస్తోంది.

కరోనా కష్టకాలంలో ప్రజలు చికిత్స కోసం ఆర్థికంగా ఇబ్బందులకు గురికావద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోవిడ్‌ ట్రీట్‌మెంట్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చారు. ప్రభుత్వ జాబితా (ఎంప్యానెల్‌)లో ఉన్న అన్ని ఆస్పత్రులలో కోవిడ్‌ పేషెంట్లకు బెడ్లు ఏర్పాటు చేసి, ఉచిత వైద్యం అందించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. బాధితులు ఇబ్బందులు పడకుండా చిరునవ్వుతో ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయి ఇళ్లకు వెళ్లేలా ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ ముందుకు సాగుతున్నారు.

అంతేకాదు, ఎంప్యానెల్ లేని ఆరోగ్య శ్రీ ఆస్పత్రుల్లో కూడా పూర్తిస్థాయి కోవిడ్‌ చికిత్స అందించాలన్న సీఎం జగన్‌.. ఆదే విధంగా ప్రైవేటు ఆస్పత్రులో ప్రభుత్వం విధించిన రేట్లకు మాత్రమే కరోనా చికిత్స చేయాలని ఆదేశించి ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడుతున్నారు. ఒకవేళ ప్రైవేటు ఆస్పతులు కరోనా పెషెంట్ల వద్ద అధిక మొత్తంలో ఫిజులు వసూలు చేస్తే చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశించి, ప్రైవేటు దోపిడీని అరికట్టేందుకు సమాయత్తమయ్యారు. కరోనా విపత్తు సమయంలో చికిత్స పేరుతో అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేటు ఆస్పత్రులను మూసివేసే అధికారం కూడా ఇస్తున్నట్లు తెలిపిన ఆయన, ప్రజారోగ్యమే ధ్యేయంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.

చదవండి: ఏపీ: కోవిడ్‌ చికిత్సకు మరింత ఇద్దాం..

మరిన్ని వార్తలు