వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో అంబేద్కర్‌కు నివాళి

6 Dec, 2020 11:36 IST|Sakshi

సాక్షి, అమరావతి: అంబేద్కర్‌ వర్థంతి సందర్భంగా తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంటకరమణ, ఎంపీ నందిగాం సురేష్‌ అంబేద్కర్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎ​స్సార్‌సీపీ పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల రేవతి, అధికార ప్రతినిధి ఈదా రాజశేఖర్ రెడ్డి పాల్గొని అంబేద్కర్‌కి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల వారి అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ అని గుర్తు చేశారు. ఆయన మన దేశానికి అందించిన రాంజ్యాంగం ప్రపంచ దేశాల్లో అత్యున్నతంగా నిలిచిందని తెలిపారు. ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఆయన చూపిన రాజ్యాంగ స్పూర్తితో పని చేస్తోందన్నారు.

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ.. అంబేద్కర్‌ విలువల్ని ప్రపంచం అంతా స్మరించుకుంటున్నారని తెలిపారు. మన దేశానికి భరతమాత ముద్దు బిడ్డ అంబేద్కర్అని తెలిపారు. ఎవరు ఆడిగారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్‌కి లేఖ రాశారని సూటిగా ప్రశ్నించారు. ఆయన పరిధి ఏమిటో తెలుసుకోవాలన్నారు. సుప్రీంకోర్టు లాయర్ల సలహా తీసుకోమని ఆయన గవర్నర్‌కి చెప్పటం ఏమిటని మండిపడ్డారు. గవర్నర్ ఎవరి సలహాలు తీసుకోవాలి, ఎలాచేయాలనే దానిపై విచక్షణాధికారం ఉంటుందని తెలిపారు. రమేష్‌ కుమార్‌ను సలహా ఇవ్వమని గవర్నర్ ఆడిగారా అని ప్రశ్నించారు. చట్ట సభల్లో తీసుకున్న నిర్ణయాలకు నీకేమి సంబంధం ఉందని దుయ్యబట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక ప్రతిపక్ష నేతలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అయనపై ఎలా విశ్వాసం ఉంటుందని, ప్రతిపక్షం మౌత్ పీస్‌లా మారిపోయారని విమర్శించారు. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తన పరిధి ఏమిటో తెలుసుకుని పని చేయాలని హితవు పలికారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు