‘అక్కడ జరిగింది.. నూటికి నూరు శాతం అక్రమాలే’

25 Mar, 2021 16:13 IST|Sakshi

ఫిర్యాదుదారులు, దళితులను టీడీపీ నేతలు భయపెడుతున్నారు..

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి/హైదరాబాద్‌‌:‌ అమరావతి భూముల విషయంలో నూటికి నూరు శాతం అక్రమాలేనని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన మేడ్చల్‌లో మీడియాతో మాట్లాడుతూ, సీఐడీ విచారణలో బాధితులు అసలు నిజాలు వెల్లడించారని పేర్కొన్నారు. బాధితుల వాంగ్మూలాలను సీఐడీ అధికారులు రికార్డ్‌ చేశారని తెలిపారు. భూముల కేటాయింపులో అక్రమాల కేసుపై కోర్టు నాలుగు వారాల వరకు మాత్రమే స్టే ఇచ్చింది.

ఫిర్యాదుదారులు, దళితులను టీడీపీ నేతలు భయపెడుతున్నారని ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు. చట్టాలను అతిక్రమించి చంద్రబాబు, నారాయణ.. భూములతో లబ్ధి పొందారని. అప్పటి ఐఏఎస్‌ అధికారులపై ఒత్తిడి తేవడమే కాకుండా మాట వినని వారిని బదిలీ చేశారని ఆయన ఆరోపించారు. భూ అక్రమాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రోజుకో  ప్రెస్ మీట్ పెట్టి.. టీడీపీ నేతలు అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. అక్రమాలపై తన పోరాటం ఆగదని.. ఎందాకైనా పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే కోర్టుకు అన్నీ వివరాలు అందజేస్తానని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.
చదవండి:
అక్రమాల పుట్ట ‘అమరావతి’
‘అసైన్డ్‌’పై గత సర్కారు తప్పు చేసినా ఎందుకు సహకరించారు?

మరిన్ని వార్తలు